Modi Oman Tour: పాక్ ప్యాంట్ తడుస్తోంది.. మోదీ ఒమన్‌ టూర్ వెనుక సంచలన వ్యూహం.. ఏంటో తెలుసా?

జోర్డాన్, ఒమన్ దేశాలతో భారత్ స్నేహంతో పాకిస్తాన్ ప్యాంట్ తడిచిపోతోంది. ముస్లిం దేశాలతో భారత్ బంధం బలపడుతుండడం పాక్ కు ఆందోళన కలిగిస్తోంది. ముస్లిం ప్రపంచంలో భారత ప్రధానికి ఇంతలా ఘన స్వాగతం లభించడంతో కుళ్ళుకుంటోంది.

New Update
india-oman

రీసెంట్ గా భారత ప్రధాని మోదీ జోర్డాన్, ఒమన్ దేశాలు తిరిగి వచ్చారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. దాంతో పాటూ జోర్డాన్ అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. ముస్లిం ప్రపంచంలో భారత ప్రధానికి ఇంతలా ఘన స్వాగతం లభించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పాకిస్తాన్ కు అయితే ప్యాంట్ తడిసి పోతోంది. ఒమన్ తో భారత్ కలిసిపోవడం, ముస్లిం దేశాల్లో మన దేశానికి మంచి పేరు రావడం ఓర్చుకోలేకపోతోంది. కావాలని పాకిస్దాన్ కు వ్యతిరేకంగా భారత్..ఒమన్ తో చేతులు కలిపిందని ఆరోపణలు చేస్తోంది. పరస్పర ప్రయోజనాల కోసమే జోర్డాన్, ఒమన్ లు ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇస్తున్నారని.. పాకిస్తాన్ నిపుణుడు ఖమర్ చీమా అన్నారు.

ముస్లిం దేశాలతో కలయిక..పాకిస్తాన్ కు ముప్పు..

ప్రధానిమోదీ ఒమన్ పర్యటన వెనుక కచ్చితంగా వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. ఒమన్‌లో భారతదేశ ప్రయోజనాలు భద్రతకు సంబంధించినవి. భారత్ ప్రస్తుతం సముద్ర వ్యవహారాలపై దృష్టి సారించింది. గల్ఫ్ ప్రాంతం, పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ఒమన్ ఒక ముఖ్యమైన భాగస్వామి. భారత్ చమురు దిగుమతుల్లో 40 శాతం హార్మూజ్ జలసంధి గుండా వెళుతుంది. దీని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఒమన్ గుండా వెళతాయి. అందుకే ఒమన్ తో భారత్ స్నేహం పెట్టుకుంటోందని పాకిస్తాన్ చెబుతోంది.  హార్ముజ్ జలసంధిలో ఏదైనా సమస్య తలెత్తితే, భారతదేశం, ఒమన్ నావికాదళాలు ఒకదానికొకటి సహాయం చేసుకోగలవని, అటువంటి పరిస్థితి గురించి ఒమన్ భారతదేశాన్ని ముందుగానే అప్రమత్తం చేయగలదని ఆయన అన్నారు.

మరో విషయం ఏంటంటే..ఒమన్‌లోని దుక్మ్ ఓడరేవు భారతదేశానికి కీలకమైన వ్యూహాత్మక ఆస్తి అని పాకిస్తాన్ నిపుణుడు అన్నారు. భారత నావికాదళం ఒమన్‌కు లాజిస్టికల్ యాక్సెస్ కూడా ముఖ్యం. హార్ముజ్ జలసంధి, గల్ఫ్ చోక్‌పాయింట్‌లను భారత్ దాటవేయాల్సిన అవసరం వచ్చినప్పుడు దుక్మ్ చాలా కీలకం. ఎర్ర సముద్రం, ఆఫ్రికా, అరేబియా సముద్రంలోకి భారత్ ప్రవేశం గురించి పాకిస్తాన్ ఆందోళన చెందుతోందని ఖమర్ చీమా అన్నారు. రెండు దేశాలు ఉమ్మడి గస్తీ నిర్వహిస్తాయి. పైరసీని ఎదుర్కోవడం కూడా ఉంది. మరోవైపు ఒమన్ కూడా ఉగ్రవాదం, అక్రమ రవాణాను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక ప్రధాన భాగస్వామితో పొత్తు పెట్టుకుందని చెప్పారు. ముస్లిం దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో ప్రధాన దేశాలన్నింటికీ భారత్ దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తోందని..ఇది పాకిస్తాన్ కు అంత మంచి విషయం కాదని పాకిస్తాన్ నిపుణుడు అన్నారు. తాజా పరిణామాలు ఆ దేశాన్ని బెంబేలెత్తిస్తున్నాయని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు