PM Modi: మోదీకి ఇప్పట్లో రిటైర్మెంట్ లేదు.. ఆ రూల్ రద్దు!
ప్రధాని మోదీకి ఇప్పట్లో రిటైర్మెంట్ లేదని.. ఈ ఐదేళ్లు ఆయన ప్రధాన మంత్రి పదవిలో కొనసాగడం ఖాయమైనట్లు తెలుస్తోంది. 79 ఏళ్ల జితన్రామ్ మాంఝీను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా 75 ఏళ్ల రూల్ ను బీజేపీ పక్కకు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. మోదీ కోసం ఇలా చేశారన్న చర్చ సాగుతోంది.