3 కోట్ల మందికి ఇళ్ల నిర్మాణం.. పేదలకు మోదీ 3.0 ఫస్ట్ గుడ్ న్యూస్

సోమవారం నిర్వహించిన మోదీ 3.0 మొదటి మంత్రివర్గ సమావేశంలో అదనంగా 3 కోట్ల గ్రామీణ, పట్టణ కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. మరిన్ని చర్చలు కొనసాగుతున్నాయి.

New Update
3 కోట్ల మందికి ఇళ్ల నిర్మాణం.. పేదలకు మోదీ 3.0 ఫస్ట్ గుడ్ న్యూస్

Modi: సోమవారం నిర్వహించిన మోదీ 3.0 మొదటి మంత్రివర్గ సమావేశంలో అదనంగా 3 కోట్ల గ్రామీణ, పట్టణ కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. పీఎంఏవై కింద మరో 3 కోట్ల గృహాలు నిర్మించాలన్న నిర్ణయానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. మరిన్ని నిర్ణయాలపై ఆమోదం తెలిపేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.

దానిపైనే తొలి సంతకం..
దేశంలో ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువు తీరింది. భారత ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం ప్రమాణాస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే ఈ రోజు జరగనున్న క్యాబినెట్ సమావేశంలో మోదీ పదవీ బాధ్యతలను స్వీకరించారు. పీఎంఓ సౌత్ బ్లాక్ లోని తన కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి సౌత్ బ్లాక్ ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రధాని మోదీ కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన నిధుల విడుదల ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. 9 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రధాని మోదీ ఫైల్ పై సంతకం చేశారు. వ్యవసాయరంగానికి మరింత చేయూత ఇస్తామని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. కేంద్ర మంత్రివర్గం PMAY-G కింద లబ్ధిదారులకు అందించే సహాయాన్ని దాదాపు 50 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్‌లో పౌరులందరికీ సరసమైన గృహాలను ఇచ్చే కార్యక్రమం గురించి  ప్రస్తావించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే ఐదేళ్లలో పీఎంఏవై-జీ కింద రెండు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు