Kesineni Nani: రాజకీయాలకు గుడ్ బై: కేశినేని నాని సంచలన ప్రకటన

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు దూరమైనా విజయవాడ అభివృద్ధికి తన కృషి కొనసాగుతుందన్నారు.

New Update
Kesineni Nani: రాజకీయాలకు గుడ్ బై: కేశినేని నాని సంచలన ప్రకటన

కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసున్నట్లు చెప్పారు. విజయవాడ ఎంపీగా రెండు సార్లు విజయం సాధించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు కేశినేని నాని. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు. ఇన్నాళ్లు వారు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు నాని. తాను రాజకీయాలకు దూరం అవుతున్నా.. విజయవాడ అభివృద్ధి పట్ల తన నిబద్ధత అలానే కొనసాగుతుందన్నారు. విజయవాడ అభివృద్ధికి తన కృషి కొనసాగుతుందన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


Advertisment
Advertisment
తాజా కథనాలు