/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/YS-Jagan-IPAC.jpg)
'ఈ సారి గెలుపు మనదే.. 2019 కంటే మెరుగైన ఫలితాలు సాధించపోతున్నాం..' మే 13 ఎన్నికల పోలింగ్ తర్వాత ఐప్యాక్ టీమ్‌ను కలిసిన జగన్ మాటలివి. అయితే నెల రోజుల గడవకముందే సీన్ మొత్తం మారిపోయింది.. ఐప్యాక్ టీమ్ తోక ముడిచింది. గుట్టుచప్పుడు కాకుండా విజయవాడ నుంచి దుకాణం సర్దేసింది. ఇది ఐప్యాక్ చరిత్రలో అత్యంత ఘోరమైన ఓటమి. ఈ పరాజయం ఐప్యాక్ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఇకపై ఐప్యాక్‌కు పని అప్పగించాలంటేనే ఎవరైనా ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిందే!
2019 ఏపీ ఎన్నికల్లో జగన్ ఘన విజయం వెనుక ఐప్యాక్ పాత్రే కీలకం. నాటి ఎన్నికల్లో వైసీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో 151 గెలుచుకుంది. 25 ఎంపీ స్థానాల్లో ఏకంగా 22 కొల్లగొట్టింది. 2024లో మాత్రం సీన్ ఉల్టా అయ్యింది.. వైసీపీ దారుణంగా 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 23 సీట్లు కూడా వైసీపీకి రాలేదు. అటు లోక్‌సభ స్థానాల్లోనూ ఘోరంగా నాలుగంటే నాలుగే సీట్లు వచ్చాయి. ఇది ముమ్మాటికి ఐప్యాక్ టీమ్ ఫెయిల్యూర్‌గానే చెబుతున్నారు విశ్లేషకులు.
2024 AP polls gave I-PAC & all its professionals a chance to work closely with @YSRCParty again. Together, we navigated this election with unyielding determination. Despite the outcome, @ysjagan's leadership is an inspiration to our team & all of AP. Our heartfelt thanks for his…
— I-PAC (@IndianPAC) June 4, 2024
ఇక జూన్ 4 ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఐప్యాక్ సభ్యులు సైలెంట్‌గా వెళ్లిపోయారు. ఇక ఫలితాలు విడుదలైన రెండు రోజుల్లోనే విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని కార్యాలయం నుంచి ఐ-ప్యాక్ టీమ్ బ్యాగులు సర్ధుకుంది. టీమ్ హెడ్ రిషి రాజ్ సింగ్ అసలు ఆఫీస్‌కు రావడమే మానేశారు. ఆయన టీమ్ సభ్యులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆఫీస్‌కి రావడం మానేస్తున్నారు. వైసీపీ పరాజయం తర్వాత ఓటమిపై ఐ-ప్యాక్ టీమ్ ఎలాంటి రివ్యూ చేయలేదు. కనీసం ఓటమికి కారణాలేంటో విశ్లేషించలేదు.
విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం @ysjagan భేటీ.#YSRCPWinningBig#YSJaganAgainpic.twitter.com/YTe6dwNBUA
— YSR Congress Party (@YSRCParty) May 16, 2024
ఇండియాలో ఎన్నికలను ప్రభావితం చేయడంలో ఐప్యాక్ టీమ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. 2014 మోదీ గెలుపు నుంచి 2021 పశ్చిమబెంగాల్‌లో దీదీ గెలుపు వరకు ఐప్యాక్ టీమ్‌కు తిరుగేలేకుండా పోయింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లీడర్‌షిప్‌లో ఐప్యాక్ టీమ్ సక్సెస్ రేట్ అమాంతం పెరిగింది. అయితే ప్రశాంత్ కిశోర్ బీహార్ పాలిటిక్స్‌లో బిజీ కావడంతో ఐప్యాక్‌లో యాక్టివ్‌గా ఉండలేకపోయారు. ఇక ఐప్యాక్ కో-ఫౌండర్ రిషి అండర్‌లోనే టీమ్ వర్క్ చేస్తోంది. అయితే ఈ టీమ్ స్ట్రాటజీలు వర్కౌట్ కాలేదని ఏపీ ఎన్నికల ఫలితాలే ప్రత్యేక్ష ఉదాహరణ!
ఓ పార్టీ 151 నుంచి 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావడమంటే అది చిన్న విషయం కాదు. జగన్ తన సొంత నేతల కంటే ఐప్యాక్ టీమ్‌నే ఎక్కువగా నమ్మారని పలువురు వైసీపీ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఐప్యాక్ టీమ్ కారణంగానే తమ పార్టీ మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓవరాల్‌గా ఐప్యాక్ ఫెయిల్యూర్‌కు అద్దం పడుతోంది. మరోసారి ఏ పార్టీ కూడా ఈ టీమ్‌ను నమ్మే సాహసం చేయలేకపోవచ్చు. మొత్తంగా చూస్తే ఇక రిషిసింగ్ కెప్టెన్సీలోని ఐప్యాక్ టీమ్‌కు ఇండియాలో ఎక్కడా కూడా ప్రాజెక్టులు దక్కే అవకాశాలు లేవని జగన్ పార్టీ ఓటమి నిరూపిస్తోంది!