పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం
పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటన బంకురాలో చోటుచేసుకుంది. గూడ్సు రైలును వెనకనుంచి వచ్చి మరో రైలు ఢీకొట్టింది. దీంతో 12 బోగీలు పట్టాలు తప్పిన్నాయి. ఈ ప్రమాదంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పాడింది.
పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటన బంకురాలో చోటుచేసుకుంది. గూడ్సు రైలును వెనకనుంచి వచ్చి మరో రైలు ఢీకొట్టింది. దీంతో 12 బోగీలు పట్టాలు తప్పిన్నాయి. ఈ ప్రమాదంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పాడింది.
దళిత కుటుంబాలు ఆర్థికంగా, స్వశక్తితో జీవించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో ఆ నియోజవర్గంలోని 14,400 మంది ఖాతాల్లో తొలి విడతగా ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున మొత్తం రూ.500 కోట్లను జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తొలి విడత దళితబంధు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం రాత్రి జీవోను రిలీజ్ చేసింది.
ఏపీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తర కోస్తాంధ్రలో బలమైన ఈదురుగాలులు ఉంటాయని అధికారులు తెలిపారు.
సినీ ఫక్కీలో కారును అడ్డగించి రూ. 40 లక్షలు దోచుకున్న దుండగులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ మల్లికార్జున్ బౌరంపేటలో దుర్గా ఆటోమొబైల్ గ్యారేజీని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన జాల అనిల్‌కుమార్ (30) గతంలో ఆయన వద్ద అకౌంటెంట్‌గా పనిచేశాడు. రెండు సంవత్సరాల క్రితం అనిల్ కుమార్‌ను విధుల నుంచి తొలగించడంతో మల్లికార్జున్‌పై పగ పెంచుకున్నాడు.
రాముడంటే వారికి ఎంతో భక్తి అంటరాని వారంటూ వారిని ఆలయంలోకి రానివ్వరు అందుకే వారు వారి శరీరాన్ని రామాలయంగా మార్చుకున్నారు. నిత్య జీవితంలో ఈ తెగ వారు ఆచరించే ప్రతి పని అత్యంత ఆసక్తికరంగానే ఉంటుంది. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా శ్రీరాముడు వీరిని ఆవహించినట్లుగానే ప్రవర్తించడం పరిపాటి. నిత్యం రామ నామ జపం వీరి ప్రథమ విధి. దేవుడంటే ఆలయాల్లో ఉండే దేవుడే కాదని నా హృదయమే దేవాలయం అంటూ ప్రపంచానికి చాటి చెప్తున్నారు. వారి తనువంతా రామమయం వారిదేహమంతా రామనామం.
ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది.
ఏపీలో అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని. అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేంద్రం సైతం ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఓ పార్టీ కార్యక్రమంలో సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జీడిమెట్ల, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.