వరంగల్‌లో మరో మెడికో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. ప్రీతి ఆత్మహత్య తర్వాత లాస్య అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో మిగతా విద్యార్థులలో ఆందోళన మొదలైంది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. ప్రీతి ఆత్మహత్య తర్వాత లాస్య అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో మిగతా విద్యార్థులలో ఆందోళన మొదలైంది.
టీడీపీ పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన ఒరిగేదేమి లేదన్నారు. త్వరలో ఏపీలో డబ్బింగ్ స్టూడియో పోయి.. కమలం వికసిస్తోందన్నారు. అంతేకానీ మీరు ఊహించినట్లుగా ఏం జరగదని సోము స్పష్టం చేశారు.
షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అయినా తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే షర్మిలకు ఉపయోగమన్నారు.
గరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని, పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
అయోధ్య రామయ్య కోసం బాహుబలి అగరబత్తి గుజరాత్‌లోని వడోదరా నగర తర్సాలీ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు తయారు చేస్తున్నారు. ఈ అగరబత్తిని మరో ఐదు నెలల్లో రామ మందిరానికి పంపిస్తామని..అగరబత్తిని పంచద్రవ్యాలతో తయారు చేస్తున్నట్లు భక్తుడు విహాభాయ్ భర్వాడ్ వెల్లడించారు.
గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా గుజరాత్‌పై పడింది. దాంతో ఆ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
అనవసరంగా ఈ విషయంలోకి నన్ను లాగుతున్నారని ఆషూ రెడ్డి సీరియస్ అయ్యారు. కేపీ చౌదరి కేసులో తన నాపేరు ఎందుకు వస్తుందని గట్టిగా ప్రశ్నించారు. నాకు ఎవరితో ఎలాంటి సంబంధాలు లేవు.. సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తుల గురించి అంతా చెబుతానని.. తనపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో ఆర్థం కావట్లేదంటూ ఆషూరెడ్డి ఫైర్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో జులై 1న గ్రూప్-4 పోస్టులకు రాతపరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సారి గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన వెలువరించింది.