హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జీడిమెట్ల, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

New Update
హైదరాబాద్‌లో భారీ వర్షం

hyd rains

వనాలే.. వానలు

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, కొంపల్లి, దుండిగల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బాగ్ లింగంపల్లి, లోయర్ ట్యాంక్ బండ్, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఉప్పల్, నిజాంపేట, ప్రగతి నగర్, కూకట్‌పల్లి, ఓయూ, ఫలక్‌నుమా, తార్నాక, లాలాపేట, రామంతాపూర్, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలాచోట్ల రహదారులపై నీరు నిలిచి, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది.

కూల్.. కూల్‌గా..

అంతేకాకుండా.. భాగ్యనగర్‌కు మరో 24 గంటలపాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులుగా హైదరాబాద్‌లో వర్షం పడుతుండడంతో ఎండ తీవ్రత, ఉక్కపోత నుండి నగర వాసులు ఉపశమనం పొందారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు