శాంతిభద్రతలు లేవు
ఇదిలా ఉంటే తాజాగా విజయవాడలో నడిరోడ్డుపై మహిళని అత్యంత దారుణంగా నరికి చంపేశారు. అయితే ఈ హత్య కుటుంబ కలహాల కారణంగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో
జక్కంపూడి కాలనీకి చెందిన నాగమణి రెండో కుమార్తెతో అల్లుడికి గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.ఈ క్రమంలో కోర్టులో కేసు కూడా నడుస్తోంది.అయితే అత్తమామ పై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేష్. అత్తమామలతో మాట్లాడుకుందామని పిలవడం జరిగిందట. ఈ క్రమంలో వాళ్ళు రావటంతో మాట్లాడుకునే క్రమంలో వివాదం తలెత్తడంతో అల్లుడు రాజేష్ మామపై కత్తితో దాడి చేయబోగా.. అతడు తప్పించుకోవటంతో. అత్తను నరికి చంపాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పరారయ్యాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.