మూడు రోజులు.. వానలే వానలు

ఏపీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తర కోస్తాంధ్రలో బలమైన ఈదురుగాలులు ఉంటాయని అధికారులు తెలిపారు.

New Update
ఢిల్లీ, ముంబైలో దంచికొడుతున్న వానలు..!!

publive-image

జోరుగా వానలు

నైరుతి రుతుపవనాల రాకతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వివరించింది. సముద్ర మట్టానికి 7.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని, నైరుతి వైపుగా సాగుతోందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ఆదివారం అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.

వేటకు వెళ్లవద్దు

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో సముద్రం ఉధృతంగా ఉందని, చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు