ఒళ్లంతా రాముడి పచ్చబొట్లే

రాముడంటే వారికి ఎంతో భక్తి అంటరాని వారంటూ వారిని ఆలయంలోకి రానివ్వరు అందుకే వారు వారి శరీరాన్ని రామాలయంగా మార్చుకున్నారు. నిత్య జీవితంలో ఈ తెగ వారు ఆచరించే ప్రతి పని అత్యంత ఆసక్తికరంగానే ఉంటుంది. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా శ్రీరాముడు వీరిని ఆవహించినట్లుగానే ప్రవర్తించడం పరిపాటి. నిత్యం రామ నామ జపం వీరి ప్రథమ విధి. దేవుడంటే ఆలయాల్లో ఉండే దేవుడే కాదని నా హృదయమే దేవాలయం అంటూ ప్రపంచానికి చాటి చెప్తున్నారు. వారి తనువంతా రామమయం వారిదేహమంతా రామనామం.

New Update
ఒళ్లంతా రాముడి పచ్చబొట్లే

Dehamera Ram Temple

తనువంతా రామాలయం

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయగడ్ జిల్లా నందేల్ అటవీ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల నుండి ఒక గిరిజన తెగ అక్కడ నివసిస్తుంది. గిరిజన తెగలను గతంలో అంటరాని వారిగా చూసేవారు అంతేకాకుండా వారిని దేవాలయాల్లోకి రాణించేవారు కాదు. గ్రామాలలో ఊరి బయటనే వారి నివాసం మంచినీటి బావులను, చెరువులను కూడా వారిని తాకనిచ్చేవారు కాదు. అటువంటి సమయంలో హరిజన తెగ ఒకటి శ్రీరాముని మీద అపారమైన భక్తితో పాదం నుండి శిరస్సు వరకు రామనామంతో పచ్చబొట్లుతో అక్కడ కనపడతారు ఆ తెగ పేరు రామనామి తెగ.

రామనామి తెగ అనేది 1890లలో రాముడిని ఆరాధించే పరశురామ్ చేత స్థాపించబడిన హిందూ శాఖ. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లో నివసిస్తున్న దాని తెగకు చెందిన వారు తమ శరీరాలపై "రామ్" అనే పదాన్ని పచ్చబొట్టు పొడిచుకుంటారు మరియు దానిపై "రామ్" అని ముద్రించిన శాలువాలు మరియు నెమలి ఈకలతో చేసిన తలపాగా ధరిస్తుంటారు.

వారి దేహమంతా రామనామం

రామ్ నామి తెగకు చెందినవారు మద్యపానం చేయరు పొగ త్రాగరు, ప్రతిరోజూ రాముని నామాన్ని జపిస్తారు. వారి శరీరంపై "రామ్" అనే పదాన్ని పచ్చబొట్టు వేయించుకుంటారు మరియు దానిపై "రామ్" అని ముద్రించిన శాలువా మరియు నెమలి ఈకలతో చేసిన తలపాగాను ధరిస్తారు. పూర్తి శరీరం పచ్చబొట్లు ఉన్నవారిని " పూర్ణాక్షిక్ " అని పిలుస్తారు. మరియు రాయ్‌పూర్ జిల్లాలోని సార్సివా గ్రామంలో డిసెంబర్-జనవరిలో పంట కాలం ముగిసే సమయానికి రామనామిలు ప్రతి సంవత్సరం మూడు రోజుల జాతర కోసం సమావేశమవుతారు. ఈ జాతరకు ఛతీఘగడ్ సీఎం జాతర సమయంలో ఎవరు ఉంటె వారు వచ్చి జాతరను ప్రారంభించటం ఆనవాయితీ.

అంచనాలకు మించి...

అధికారిక రికార్డులలో రామనామీలు హిందువులుగా జాబితా చేయబడినందున, ఖచ్చితమైన జనాభా లెక్కల వివరాలు అందుబాటులో లేదు. కానీ వార్షిక భజన మేళాకు హాజరైన వారి సంఖ్య ఆధారంగా వారి జనాభా 20వేల కంటే ఎక్కువ ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇతరులు దీనిని ఒక లక్ష కంటే ఎక్కువగా అంచనా వేస్తున్నారు. రామనామిలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని మహానది నది వెంబడి ఉన్న గ్రామాలలో నివసిస్తున్నారు. అయితే కొంతమంది అనుచరులు మహారాష్ట్ర మరియు ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో కూడా నివసిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు