విశాఖలో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్
విశాఖలో నగరంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్(Volunteer)హత్య చేశాడు. సుజాతనగర్(Sujatanagar)లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగారు గొలుసు కోసం వృద్దురాలిని వాలంటీర్ హతమార్చడం కలకలం రేపింది.
విశాఖలో నగరంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్(Volunteer)హత్య చేశాడు. సుజాతనగర్(Sujatanagar)లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగారు గొలుసు కోసం వృద్దురాలిని వాలంటీర్ హతమార్చడం కలకలం రేపింది.
మణిపూర్ అంశంపై విపక్ష నేతలు పట్టు వీడడం లేదు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఛాంబర్లో జరగనున్న సమావేశంలో మణిపూర్ అంశమే ప్రధాన అజెండా కానుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో అన్ని అంశాలనూ పక్కనబెట్టి మణిపూర్ అంశంపైనే ప్రధానంగా చర్చించాలని ప్రతిపక్ష కూటమి సభ్యులు పట్టుబడుతున్నారు.
ఇవాళ(జులై 31) తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్లో ఈ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్లో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై మంత్రులతో చర్చించనున్నారు కేసీఆర్.
553 పోస్టుల కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయగా..అప్లికేషన్కి సంబంధించిన గడువు ఆగస్టు 4న ముగియనుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూ దశల్లో ఉంటుంది.
ఈ ఏడాది ఐపీఎల్లో జరిగిన కోహ్లీ వర్సెస్ గంభీర్ ఇష్యూ తనను ఎంతగానో బాధించిందన్నారు కపిల్ దేవ్. ఆటగాళ్లను బీసీసీఐ గొప్పగా తీర్చిదిద్దితే సరిపోదని.. మంచిగా కూడా తయారు చేయాలన్నారు ఈ మాజీ లెజండ్. అటు యంగ్ క్రికెటర్లపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్లను సలహా అడిగేందకు వాళ్లకి అహం అడ్డొస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
చట్టం ఇచ్చిన ప్రత్యేక అధికారంతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రక్షకభటులతో పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు వచ్చిన భాదితుడిపైనే ధర్డ్ డిగ్రీ చేసిన ఘటన ఏలూరు పట్టణంలో జరిగింది.
భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం ప్రత్యేకత. రకరకాల మతాలు, భాషలు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఎవరికి నచ్చినట్లు వారు జీవిస్తుంటారు. ఇందులో ఇతరులు కలుగజేసుకోవడం సమంజసం కాదు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదు. కానీ ఐఐటీ బాంబే లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో వెజ్-నాన్ వెజ్ వివాదం రాజుకుంది.
పాకిస్తాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. వాయవ్య పాకిస్తాన్ లో జమైత్ ఉలేమా ఇ ఇస్లాం ఎఫ్(జేయూఐ-ఎఫ్) సమావేశంలో బాంబు పేలడంతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో 39 మంది మరణించారు. మరో 80 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తెలంగాణలో అధికారం ఒకే కుటుంబం చేతిలో ఉందని బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇంకా 50 ఏళ్ళు ఉన్నా ముఖ్యమంత్రి పదవి ఆ కుటుంబం దాటి బయటకు రాదన్నారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కి ఆత్మీయ సత్కారాన్ని చేశారు.