విశాఖలో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్

విశాఖలో నగరంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్(Volunteer)హత్య చేశాడు. సుజాతనగర్‌(Sujatanagar)లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగారు గొలుసు కోసం వృద్దురాలిని వాలంటీర్ హతమార్చడం కలకలం రేపింది.

New Update
విశాఖలో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్

బంగారం కోసం హత్య చేశాడు..

ఒంటరి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసుపై కన్నేసిన వాలంటీర్ చోరీచేసే క్రమంలో ఆమెను గొంతు పిసికి హతమార్చాడు. వృద్ధురాలి కుమారుడి వద్ద పనిచేస్తున్న నిందితుడు షాపు తాళాలు అప్పగించేందుకు వెళ్లి హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. 95వ వార్డు సచివాలయం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ వృద్దురాలిని హత్య చేసినట్లుగా గుర్తించిన పోలీసులు పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి (73) కుమారుడు శ్రీనివాస్ నిర్వహిస్తున్న షాపులో వెంకటేష్ పనిచేస్తున్నాడు. వాలంటీర్‌గా పనిచేసే వెంకటేష్‌ పార్ట్‌టైమ్‌‌గా చికెన్‌ షాపులో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి దుకాణం మూసిన తర్వాత రాత్రి 10:30 గంటలకు యజమాని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉండటాన్ని గమనించి చోరీ చేయాలని భావించాడు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో వృద్ధురాలి ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.

సీసీ టీవీలో దృశ్యాలు

హత్య చేసిన తర్వాత వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వృద్ధురాలు ఉంటున్న అపార్ట్‌మెంట్ లోపలికి వచ్చి వాలంటీర్ వెంకటేష్ బయటికి వెళ్లిన్నట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హత్య జరిగిన కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు వృద్ధురాలు మంచంపై పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు, క్లూస్ టీమ్ చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలిని గొంతు పిసికి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు . బాధిత కుటుంబ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పవన్ మాటల్లో తప్పు లేదు

ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థపై గతంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తిన్నాయి. ఈ మేరకు వాలంటీర్లు. పవన్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న వాలంటీర్ల సేవలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ వ్యవస్థను నిర్వీర్వం చేయాలని చూస్తున్నారని ఆగ్రహిస్తూ.. తక్షణమే తమకు పవన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేస్తున్నాయి. తాజాగా వాలంటీర్ చేసి హత్యతో ఈ వ్యవస్థపై అధికార పార్టీ ఏంటదో చూడాలి మరి.

Advertisment
Advertisment
తాజా కథనాలు