విపక్ష కూటమి ‘ఇండియా’కు చెందిన నేతలు పార్లమెంటులో తాము అనుసరించాల్సిన వ్యూహంపై మరికొద్దిసేపట్లో చర్చించనున్నారు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఛాంబర్లో జరగనున్న సమావేశంలో మణిపూర్ అంశమే ప్రధాన అజెండా కానుంది. ఆ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించి తిరిగి వచ్చిన 21 మంది సభ్యుల ప్రతినిధి బృందం.. తమ ఫ్లోర్ లీడర్లకు అక్కడి పరిస్థితులపై వివరించబోతున్నారు. తమ తొలిరోజు పర్యటనలో వీరు మణిపూర్ లోని షెల్టర్ హోమ్స్ లో తలదాచుకున్న నిర్వాసితులను కలుసుకున్నారు. ఇంఫాల్, మొయిరాంగ్, బిష్ణుపూర్, చురా చంద్ పూర్ జిల్లాల్లోని పునరావాస శిబిరాల్లో ఉంటున్నవారి పరిస్థితి దయనీయంగా ఉందని ఈ ఎంపీలు పేర్కొన్నారు. తమ పర్యటన అనుభవాలకు సంబంధించి వీరు నిన్నరాజ్ భవన్ లో ఆరాష్ట్ర గవర్నర్ అనసూయ ఊకేని కలిసి ఓ మెమోరాండం సమర్పించారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేలా చూసేందుకు వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి పరిస్థితులను వివరించాలని ఈ మెమొరాండంలో కోరారు. మణిపూర్ లో గత 89 రోజులుగా శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, అల్లర్లు, ఘర్షణలకు గురై పునరావాస శిబిరాల్లో ఉంటున్నవారికి సరైన సదుపాయాలను ప్రభుత్వం కల్పించలేదని విపక్ష ఎంపీలు వెల్లడించారు. ఇవే అంశాలను వీరు ఫ్లోర్ లీడర్లకు వివరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతినిధి బృందం లోని సభ్యుల్లో పలువురు ముక్త కంఠంతో ఇవే అభిప్రాయాలను స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో వ్యూహంపై విపక్షాల చర్చ
మణిపూర్ అంశంపై విపక్ష నేతలు పట్టు వీడడం లేదు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఛాంబర్లో జరగనున్న సమావేశంలో మణిపూర్ అంశమే ప్రధాన అజెండా కానుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో అన్ని అంశాలనూ పక్కనబెట్టి మణిపూర్ అంశంపైనే ప్రధానంగా చర్చించాలని ప్రతిపక్ష కూటమి సభ్యులు పట్టుబడుతున్నారు.

Translate this News: