ఐఐటీ బాంబేలో మరోసారి రాజుకున్న వెజ్-నాన్ వెజ్ వివాదం

భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం ప్రత్యేకత. రకరకాల మతాలు, భాషలు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఎవరికి నచ్చినట్లు వారు జీవిస్తుంటారు. ఇందులో ఇతరులు కలుగజేసుకోవడం సమంజసం కాదు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదు. కానీ ఐఐటీ బాంబే లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో వెజ్-నాన్ వెజ్ వివాదం రాజుకుంది.

New Update
ఐఐటీ బాంబేలో మరోసారి రాజుకున్న వెజ్-నాన్ వెజ్ వివాదం

వెజిటీరియన్లు మాత్రమే కూర్చోవాలి..

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. రకరకాల మతాలు, భాషలు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవడం సమంజసం కాదు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఐఐటీ బాంబే ఒకటి. ఇప్పుడు ఈ సంస్థకు చెందిన హాస్టల్ క్యాంటీన్‌లో చెలరేగిన వెజ్-నాన్ వెజ్ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. గత వారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నెంబరు 12 క్యాంటీన్‌లో వెజిటీరియన్లు మాత్రమే కూర్చోవాలని పోస్టర్లు వెలిశాయి. ‌ మాంసాహారం తిన్న ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానించడంతో ఈ వివాదం రాజుకుంది. మాంసాహారం తినే విద్యార్థులు ఎవరైనా అక్కడ కూర్చుంటే వారిని బలవంతంగా అక్కడ నుంచి తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

సోషల్ మీడియాలో తీవ్ర చర్చ..

దీనిపై స్పందించిన అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హాస్టల్‌లో తినే ఆహారం ఆధారంగా విద్యార్థుల విభజన ఉందా అనే అంశంపై సమాచార హక్కుచట్టం ద్వారా వివరణ కోరగా అలాంటిదేమి లేదని సమాధానం వచ్చింది. ఆర్టీఐ సమాధానాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కానీ కొందరు వ్యక్తులు మాంసాహారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. శాకాహారులు మాత్రమే ఇక్కడ కూర్చునేందుకు అనుమతి ఉందంటూ పోస్టర్లు వేస్తున్నారని.. అక్కడ కూర్చుంటే ఖాళీ చేయిస్తున్నారని మండిపడింది. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అట్టడుగు వర్గాలను అవమానిస్తున్నారని అందుకే అలాంటి పోస్టర్లు వేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

2018లోనూ ఇలాంటి వివాదమే..

ఈ వివాదంపై ఐఐటీ బాంబే యూనివర్సిటీ ఉన్నత అధికారులు ఎవరు స్పందించలేదు. 2018లోనూ మాంసాహారం తీసుకునే విద్యార్థులు విడిగా ప్లేట్‌లు తీసుకోవాలని సర్క్యులర్ జారీ అయింది. అప్పట్లో ఈ సర్క్యులర్ తీవ్ర వివాదాస్పదమైంది. మాంసాహారం తినని చాలా మంది విద్యార్థుల నుంచి డిమాండ్లు వచ్చిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని హాస్టల్ మెస్ కౌన్సిల్ వివరణ ఇచ్చింది. తాజాగా మరోసారి వెజ్-నాన్ వెజ్ వివాదం రాజుకుంది. దీనిపై యూనివర్సిటీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు