ముగుస్తున్న అప్లికేషన్ గడువు..త్వరపడండి..లక్షా 70వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం..! 553 పోస్టుల కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయగా..అప్లికేషన్‌కి సంబంధించిన గడువు ఆగస్టు 4న ముగియనుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూ దశల్లో ఉంటుంది. By Trinath 31 Jul 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. QCI అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఎగ్జామినర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 14నే ప్రారంభమవగా.. మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఆగస్టు 4లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-అడ్మిట్ కార్డ్ ఆగస్టు 14న విడుదల చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 3న నిర్వహిస్తారు. ప్రధాన పరీక్ష అక్టోబర్ 1న ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భర్తీ చేస్తుంది. సంస్థలో మొత్తం 553 ఖాళీలు ఉన్నాయి. ఖాళీ వివరాలు: • బయో-టెక్నాలజీ - 50 • బయో-కెమిస్ట్రీ - 20 • ఆహార సాంకేతికత - 15 • కెమిస్ట్రీ - 56 • పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ - 9 • బయో మెడికల్ ఇంజనీరింగ్ - 53 • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – 108 • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 29 • కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 63 • భౌతికశాస్త్రం - 30 • సివిల్ ఇంజనీరింగ్ - 9 • మెకానికల్ ఇంజనీరింగ్ - 99 • మెటలర్జికల్ ఇంజనీరింగ్ - 4 • టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ - 8 ‣ అర్హత: వయోపరిమితి: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీ నాటికి కనీస వయసు 21 సంవత్సరాలు, గరిష్ట వయసు 35 సంవత్సరాలు. ➡ విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ➡ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూ. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షలో కనీస అర్హత మార్కులు 30 శాతం, OBC/EWS 25 శాతం. మిగతా వారందరికీ 20 శాతం. ఇదిలా ఉంటే, ప్రిలిమినరీ, మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూల పరీక్షల మాధ్యమం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ రౌండ్ 100 మార్కులకు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష తర్వాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. జీతం: ఎంపికైన అభ్యర్థులు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు. ఎగ్జామ్ ఫీజ్: జనరల్, OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజ్ 1,000రూపాయలు. SC, ST, PwD/ దివ్యాంగులు (PH), అలాగే అన్ని వర్గాల మహిళలు రూ.500 రూపాయలు చెల్లించాలి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి