/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kcr-fet-1-jpg.webp)
తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు వరదలు.. మరోవైపు పొలిటికల్ హీట్.. ఇంకోవైపు ముంచుకొస్తోన్న అసెంబ్లీ ఎన్నికలు.. ఇలా విభిన్న పరిస్థితుల మధ్య ఇవాళ (జులై 31) మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ (cm kcr) అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ (cabinet) భేటీ కానుంది. ఈ మీటింగ్‌లో 40 నుంచి 50 అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వరదలపైనే ఎక్కువగా చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది . రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం.. ఈ విషయంపై మంత్రులతో కలిసి సమీక్షంచనున్నారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు.. ఇకపై తీసుకోబోయే చర్యలపై చర్చించనున్నారు.
ఏ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది?
భారీ వరదల తర్వాత అనేక జిల్లాల్లోని చాలా గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ప్రభుత్వ సహాయ సహకారాలు కొనసాగుతున్నా.. గులాబీ సర్కార్ ఇంకా చేయాల్సి ఉందని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టం విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయాల్సి ఉంది. అందుకే వరదల కారణంగా ఎంత నష్టం వాటిల్లందన్నదానిపై ఈ కేబినెట్‌లో ఓ అంచనాకు రానున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలపై మంత్రులు చర్చించనున్నారని ప్రభుత్వం తెలిపింది. అటు ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండడంతో దాని విధివిధానాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది.
తెలంగాణకు భారీ వర్ష సూచన:
ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుతున్నాయని అంతా హమ్మయ్యా అనుకుంటున్న వేళ వాతావరణశాఖ నుంచి మరో బాంబ్ లాంటి అప్‌డెట్ వచ్చింది. ఇవాళ (జులై 31), రేపు (ఆగస్టు 01) కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. పశ్చిమబెంగాల్, ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడగా.. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందంది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ములుగు జిల్లా (mulugu district) ప్రజల్లో టెన్షన్ పెరిగిపోయింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ప్రజలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వరుణుడు నింపిన విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే మరోసారి వర్షాలు పడతాయన్న వార్తలు కలవర పెడుతున్నాయి. అయితే ఈ రెండు రోజులు కురిసే వర్షాలు గతంలో లాగా ఉండవని.. ప్రజలు భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు.