పొగరు, అహం.. కోహ్లీ, గంభీర్‌ ఫైట్‌ ఇష్యూపై లెజండరీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు!

ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిగిన కోహ్లీ వర్సెస్‌ గంభీర్ ఇష్యూ తనను ఎంతగానో బాధించిందన్నారు కపిల్‌ దేవ్‌. ఆటగాళ్లను బీసీసీఐ గొప్పగా తీర్చిదిద్దితే సరిపోదని.. మంచిగా కూడా తయారు చేయాలన్నారు ఈ మాజీ లెజండ్. అటు యంగ్‌ క్రికెటర్లపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్లను సలహా అడిగేందకు వాళ్లకి అహం అడ్డొస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

New Update
పొగరు, అహం.. కోహ్లీ, గంభీర్‌ ఫైట్‌ ఇష్యూపై లెజండరీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు!

క్రికెట్‌ ఫ్యాన్స్‌కి ఈ ఏడాది ఐపీఎల్‌(IPL) చెరిగిపోని జ్ఞాపకాలను అందించింది. ముఖ్యంగా రెండే రెండు విషయాలు అందరి మనసుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. అందులో ఒకటి ధోనీ(dhoni) ఐపీఎల్‌ కప్‌ సాధించడంరెండోది కోహ్లీ-గంభీర్‌(kohli-gambhir) కాంట్రవర్శీ. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఎన్నో సార్లు ప్లేయర్ల మధ్య గొడవలు జరిగినా.. చెంప దెబ్బలు తగిలించుకున్నా.. బ్యాట్లు విసిరినా.. అన్నిటిలోనూ ఎక్కువగా ట్రెండింగ్‌ అయ్యింది కోహ్లీ-గంభీర్‌ ఇష్యూనే. ఈ ఏడాది లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్‌ కొట్టుకున్నాంత పని చేశారు. ఈ ఘటనపై కపిల్‌ దేవ్‌(kapil dev) తాజాగా స్పందించారు.

చాలా బాధించింది:
బీసీసీఐ ఆటగాళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దితే సరిపోదని.. వాళ్లని మంచి మనుషులగానూ తయారు చేయాలని కపిల్‌దేవ్‌ చురకలంటించారు. ఐపీఎల్‌లో గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లి మధ్య జరిగిన గొడవ తనను ఎంతగానో బాధించిందన్నారు కపిల్‌ దేవ్‌. గంభీర్‌, కోహ్లీ ఇద్దరూ ప్రపంచ కప్‌ విజేతలని.. గ్రౌండ్‌లో వారి ప్రవర్తన చూసి షాక్‌కి గురయ్యానని చెప్పారు.తనకు ఇద్దరూ అత్యంత ముఖ్యమైన వ్యక్తులని.. విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్‌ టాప్‌ బ్యాటర్లలో ఒకరని.. గంభీర్ ఇప్పుడు పార్లమెంటు సభ్యుడని.. అలాంటి స్థాయిలో ఉన్న వాళ్లు ఇలా ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. అయితే క్రీడాకారులు ఏదో ఒక సమయంలో సహనం కోల్పోతారని.. పీలే నుంచి డాన్ బ్రాడ్‌మాన్ వరకు అలానే చేశారని 'ది వీక్'‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రపంచ ఛాంపియన్ వ్యాఖ్యలు చేశారు.

publive-image కపిల్ దేవ్, గవాస్కర్ (ఫైల్)

సీనియర్లను అడగడానికి ఏం సమస్య?
'అన్ని తెలుసని అనుకోవద్దు..ఇది ఎప్పటికైనా ప్రమాదమే..' ఇదే విషయాన్ని కపిల్‌ దేవ్‌ టీమిండియా యంగ్‌ క్రికెటర్ల గురించి వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌ ఆడడం వల్ల యువ క్రికెటర్లలో కాన్ఫిడెన్స్‌ పెరిగిన మాట నిజమేనని.. అయితే అదే సమయంలో వాళ్లలో ఇగో కూడా పీక్స్‌కు చేరిందన్నారు. ఆట పరంగా ఏదైనా సమస్య ఉంటే సీనియర్లను అడగాలని.. అన్ని తమకే తెలుసని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఐపీఎల్ ద్వారా డబ్బుతో పాటు ఇగో కూడా వచ్చేస్తుందని తెలిపారు. సచిన్‌, ద్రవిడ్‌ లాంటి ఆటగాళ్లే గవాస్కర్‌ దగ్గర సూచనలు తీసుకునేందుకు వచ్చేవారని.. ఆట పరంగా ఏమైనా సమస్య ఉంటే సలహాలు తీసుకునేవారని గుర్తు చేశారు కపిల్ దేవ్.

"50 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న సునీల్ గవాస్కర్ ప్రస్తుతం వెస్టిండీస్‌లోనే ఉన్నారు. ఎవరైనా యువ ఆటగాళ్లు ఆయన దగ్గరికి వెళ్లి, విలువైన సలహాలు తీసుకోవడానికి ప్రయత్నించారా? ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారా? కొన్నిసార్లు వినడం కూడా మీ ఆలోచనలను మార్చగలదు.." అంటూ కపిల్‌ దేవ్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు