సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ..
గుజరాత్లోని కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం(BSF), ఆర్మీ, నేవి, వాయుసేన సిబ్బందితో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. సైనికులకు మిఠాయిలు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.