/rtv/media/media_files/2025/06/07/L0iAU7i5aVxOOCB4PAIV.jpg)
Uddhav Thackerey on possible shiva sena (UBT)-MNS alliance
మహారాష్ట్ర(Maharashtra)లో రాజకీయాలు రసవత్తరంగా మరాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పార్టీ.. తన బంధువు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)తో పొత్తు పెట్టుకోనున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో స్పందించారు. పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ? అనే నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు. మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుందని అన్నారు. ఇరు పార్టీల్లో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు.
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
రాజ్ ఠాక్రే కూడా గతంలో శివసేన పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత పార్టీ నుంచి వెళ్లిపోయి 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పార్టీని స్థాపించారు. ఇక 2022లో మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుటో శివసేన రెండు ముక్కలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం కూడా షిండే నేతృత్వంలోనే శివసేనను నిజమైన శివసేన పార్టీగా గుర్తించింది.
Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
ఇక ఉద్దవ్ ఠాక్రే పొత్తు అంశంపై చేసిన వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ? అనేది ఠాక్రే కుటంబానికి సంబంధించిన అంశమని అన్నారు. ఈ విషయంలో తనకు సంబంధం లేదని తెలిపారు. మరోవైపు దీనిపై శివసేన (UBT)తో పొత్తులో ఉన్న కాంగ్రెస్ కూడా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలను స్వాగతించింది. ఇరు పార్టీలతో చర్చలు నడుస్తున్నాయని పేర్కొంది. బీజేపీ నుంచి మహారాష్ట్ర ప్రజలను రక్షించేందుకు రెండు పార్టీలు కలుస్తాయని పేర్కొంది. వాళ్లు కలిస్తే తాము స్వాగతిస్తామని కాంగ్రెస్ ప్రతినిధి అతుల్ లొందే అన్నారు.
Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
Follow Us