/rtv/media/media_files/2025/05/31/AemIkVNQke304Ne6DVZz.jpg)
2 killed in Russian attacks on Ukraine as prospects for talks remain uncertain
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్న నేపథ్యంలో ఇటీవల ఇరుదేశాల మధ్య టర్కీ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. కానీ అవి ఫలించకపోవడంతో తాజాగా మళ్లీ ప్రత్యక్ష చర్చల కోసం రష్యా ప్రతిపాదనలు చేసింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు రష్యా.. ఉక్రెయిన్‌పై దాదాపు 100కు పైగా డ్రోన్లు, 5 క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 42 డ్రోన్లను తమ సైన్యం ధ్వంసం చేసిందని పేర్కొంది.
Also Read: యుద్ధ విమానం కూలిపోయింది.. ఆపరేషన్ సిందూర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
Russian Attacks On Ukraine
ఈ దాడుల్లో జపోరిజ్జియా ప్రాంతంలోని 9 ఏళ్ల చిన్నారితో మరో వ్యక్తి మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వ సలహాదారు ఆండ్రీ యెర్మాన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం టర్కీలో రష్యాతో ప్రత్యక్ష శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అయితే చర్చల ప్రారంభించే ముందు యుద్ధం ముగింపుపై రష్యా తన వైఖరిని ఏంటో చెబుతూ .. వాగ్దానం చేసిన మెమోరాండాన్ని తమకు అందిచాలని కండిషన్ పెట్టారు. అలాగే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: జాబ్ మానేసిన వ్యక్తిని చితక్కొట్టిన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..?
ఈ క్రమంలోనే మే 19న ట్రంప్, పుతిన్ ఫోన్ కాల్‌లో దాదాపు రెండు గంటలకు పైగా మాట్లాడారు. ఆ తర్వాత పుతిన్ స్పందిస్తూ శాంతి ఒప్పందానికి సంబంధించి ఉక్రెయిన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం అన్నారు. ఇదిలాఉండగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేసేందుకు ఇప్పటికే ఉత్తర కొరియా వేలాది మంది సైన్యాన్ని, ఆయుధాలను రష్యాకు పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 14 వేల మంది సైన్యం, 100 బాలిస్టిక్ క్షిపణులు ఇతర ఆయుధాలను రష్యాకు పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంటోంది.
Also Read: జాబ్ మానేసిన వ్యక్తిని చితక్కొట్టిన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..?
Also Read : పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!
telugu-news | rtv-news | russia-ukraine-war
Follow Us