ముగ్గురు పిల్లలకు తల్లి.. యువకుడితో వివాహేతర సంబంధం.. చివరికి ఊహించని ట్విస్ట్

తమిళనాడులో ముగ్గురు పిల్లలకు తల్లైన ఓ మహిళ.. ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వాళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఆ యువకుడిలో ఉండటాన్ని చూసిన మహిళ.. పోలీసులను ఆశ్రయించింది.

New Update
Mother of three children, having an extramarital affair with a young man in Tamil Nadu

Mother of three children, having an extramarital affair with a young man in Tamil Nadu

ఈమధ్య వివాహేత సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. తమిళనాడులో ఓ ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలకు తల్లైన ఓ మహిళ.. ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్లూరు జిల్లా ఆర్కేపేట ఎస్వీజీపురం ప్రాంతానికి చెందిన కౌసల్య (35) అనే మహిళకు పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన భర్తతో మనస్పర్థలు వచ్చి విడిపోయింది.     

Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం

ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం వెంగళరాజకుప్పం గ్రామానికి చెందిన పద్విన్ అనే వ్యక్తితో ఆమెకు 4 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వీళ్లిద్దరూ నాలుగేళ్ల పాటు సహజీవనం కొనసాగించారు. అయితే జూన్ 10న పద్విన్ ఫోన్‌ను కౌసల్య చూడగా.. వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో అతడిని కౌసల్య నిలదీయగా.. విషయం బయటకు చెబితే సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. చివరికి ఆమె ఆర్కేపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వాళ్లిద్దరీ సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకొని పరిశీలించారు.

Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ

అయితే పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ కౌసల్య జిల్లా ఎస్పీ శ్రీనివాస పెరుమాల్‌కు ఫిర్యాదు చేసింది. పద్విన్‌తో పాటు అతడి పిన్ని ఉమ, బంధువు పయణి, స్నేహితుడు అయ్యప్పన్ తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరింది. చివరికీ ఆర్కేపేట పోలీసులు పద్విన్ సెలఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. మరోవైపు పద్విన్‌కు ఇటీవల పెళ్లి సంబంధం కూడా కుదరడంతో అతడు కౌసల్యకు దూరం అయినట్లు తెలుస్తోంది. అయితే కౌసల్య అతడిని తనతో పాటు జీవించాలని కోరిందని కానీ పద్విన్‌ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైనట్లు పోలీసులు తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు