/rtv/media/media_files/2025/07/08/why-is-maharashtra-debating-over-hindi-and-marathi-2025-07-08-18-29-43.jpg)
Why Is Maharashtra Debating Over Hindi And Marathi
మహారాష్ట్రలో భాషా వివాదం దుమారం రేపుతోంది. ఇటీవల ఓ స్థానిక చిరు వ్యాపారి మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించడంతో అతనిపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి స్థానిక వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. దీనికి నిరసనగా రాజ్‌థాక్రే ఆధ్వర్యంలోని MNS కార్యకర్తలు థానేలో నిరసన ప్రదర్శనలు చేపట్టగా.. వాళ్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీనిపై స్పందించారు. ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. MNS కార్యకర్తలు నిరసన చేసేందుకు పోలీసులు ఓ మార్గాన్ని కేటాయించారని చెప్పారు. కానీ వాళ్లు వినకుండా వేరే మార్గంలో వెళ్లడంతోనే పోలీసులు అడ్డుకున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : నెల్లూరులో మారుతోన్న రాజకీయం.. జిల్లాలో అసలేం జరుగుతోంది?
ఏంటీ ఈ వివాదం ?
ప్రస్తుతం మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఏప్రిల్ 16న ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం త్రిభాష విధానం అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విద్యా విధానంలో (NEP)లో భాగంగా పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని మూడో భాషగా తప్పనిసరిగా బోధించాలని ఆదేశించింది. దీంతో ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం హిందీని ఆప్షనల్‌గా మారుస్తూ సవరణ చేసింది. దీనిప్రకారం ఒకవేళ ఏదైనా పాఠశాలలోని ఒక క్లాస్‌లో 20 మంది విద్యార్థులు హిందీ కాకుండా మరో భారతీయ భాషను నేర్చుకోవాలనుకున్నా కూడా ప్రత్యేకంగా ఆ భాష కోసం టీచర్‌ను నియమిస్తారు. లేదా ఆ భాషను ఆన్‌లైన్‌లో బోధిస్తారు.
Also Read: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్
వెనక్కి తగ్గిన ప్రభుత్వం
అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్ ఈ నిర్ణయంపై కూడా పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అధికార మహాయుతి ప్రభుత్వంపై పోరాడేందుకు శివసేన(UBT) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కలిసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వం త్రిభాష విధానంపై వెనక్కి తగ్గింది. దీని అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే ఈ పాలసీని సవరించేందుకు విద్యావేత్త నరేంద్ర జాదవ్ నేతృత్వంలోని ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
కానీ ఈ కమిటీ కూడా మూడో భాష ఉండకూడదని ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు దీనికి తీవ్ర వ్యతిరేకత రావడంతో చివరికీ ప్రభుత్వం ఈ త్రిభాష విధానం అమలును రద్దు చేసింది. ప్రభుత్వం ఇలా వెనక్కి తగ్గడంతో గత శనివారం ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు కలిసి ముంబైలో విక్టరీ పరేడ్‌ను నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో భాషకి సంబంధించిన వివాదాలు చెలరేగాయి. ఓ చిరు వ్యాపారి మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించడంతో ఇటీవల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్తలు అతనిపై దాడికి దిగారు. దీంతో స్థానిక వ్యాపారులు దీనిపై నిరసన చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ తాజాగా ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు కూడా నిరసనలు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉండగా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. హిందీని తమపై బలవంతగా రుద్దుతున్నారని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదని స్పష్టం చేసింది.
Also read: ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగల దోపిడి.. అప్పటికి ఎన్ని సార్లు చేశారో తెలుసా..?
Also Read : తోడుంటాడని పెళ్లిచేసుకుంటే..రూ. 28 కోట్లు దోచుకున్నాడు..
telugu-news | rtv-news | maharashtra