/rtv/media/media_files/2025/07/04/russia-becomes-first-country-to-recognise-afghanistan-taliban-govt-2025-07-04-12-38-53.jpg)
Russia becomes first country to recognise Afghanistan’s Taliban government
2021లో అఫ్గానిస్థాన్‌ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి వాళ్లు తమ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఏ దేశం కూడా వాళ్ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. అయితే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.
Also Read: ఎయిరిండియా ప్రమాదం.. ఆర్థిక వివరాలిస్తేనే పరిహారం !
అఫ్గానిస్థాన్‌లో తాబిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడం అనేది ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకార అభివ-ృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొంది. అయితే తాలిబన్లు ఇప్పటికే చైనా, యూఏఈ దేశాలతో రాయబారులను మార్పిడి చేసుకుంది. అలాగే ఖతార్‌లో రాజకీయ కార్యాలయాన్ని కూడా నిర్వహిస్తోంది. కానీ ఇప్పటిదాకా ఏ దేశం కూడా అఫ్గానిస్థాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. కానీ రష్యా మాత్రం వాళ్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. దీనిపై అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాకీ స్పందించారు. రష్యా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇది ఇతర దేశాలకు ఓ ఉదాహరణగా ఉంటుందని పేర్కొన్నారు.
2021లో అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో తాలిబన్లు అప్పటి అధికార ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని దేశాలు అఫ్గానిస్థాన్ రాజధాని అయిన కాబుల్‌లో దౌత్యపరమైన కార్యకలాపాలు నిర్వహించాయి. వాటిలో రష్యా కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో రష్యా తాలిబన్లతో తమ దౌత్యపరమైన సంబంధాన్ని మరింత పెంచుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తాలిబన్లను ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి కూడా తొలగించింది.
Also Read: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకే.. రేసులో ముగ్గురు
అంతేకాదు 2022, 2024లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరగిన రష్యా ఫ్లాగ్‌షిప్ ఆర్థిక ఫోరమ్ సదస్సులో కూడా తాలిబన్ ప్రతినిధుల బృందం పాల్గొంది. గత మూడేళ్ల నుంచే తాలిబన్లు, రష్యా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అఫ్గాన్ ప్రజలు రష్యా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.