/rtv/media/media_files/2025/07/07/arrest-2025-07-07-20-50-07.jpg)
acb officials- arrested- miryalaguda- deputy -tahashildar
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిప్యూటీ తహశీల్దార్ జావీద్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. పౌర సరఫరాల శాఖ సీజ్ చేసినటువంటి వాహనాలు విడుదల చేసేందుకు ఆయన ఇటీవల లంచం తీసుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో కొందరు తక్కువ ధరకే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. ఏపీలో అధిక ధరకు అమ్మేస్తున్నారు.
Also read: ఇస్రో ఛైర్మన్‌తో స్పేస్ నుంచి శుభాంశు శుక్లా ఫోన్ సంభాషణ.. ఏం మాట్లాడారంటే ?
ఇలా విక్రయిస్తున్న పలు వాహనాలను మిర్యాగూడలో సీజ్ చేశారు. అయితే వాటిని విడుదల చేయాలని ఓ వ్యక్తి డిప్యూటీ తహశీల్దార్ జావీద్‌ను కలిశాడు. ఇందుకోసం జావిద్ రూ.70 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరికి ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. అవినీతి ఆరోపణల కారణంతో జావిద్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
Also Read: అమ్మో.. రామాయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?