/rtv/media/media_files/2025/07/07/king-cobra-2025-07-07-14-20-35.jpg)
King Cobra
చిన్న పామును చూస్తూనే కొందరు భయంతో పరుగులు తీస్తారు. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా కంటబడితే ఇక అంతే సంగతులు. అయితే ఓ లేడీ ఆఫీసర్ మాత్రం ఏకంగా ఓ 18 అడుగుల కింగ్ కోబ్రాను అవలీలగా పట్టేశారు. ఏమాత్రం భయపడకుండా, బెరుకు లేకుండా దాన్ని సంచిలో వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని పెప్పరలో ఓ కాలువలో స్థానికులు కింగ్ కోబ్రాను గుర్తించారు.
Also Read : వామ్మో.. మనిషిని మింగేసిన భారీ కొండచిలువ.. వీడియో వైరల్
Viral Video Of King Kobra
கேரளா - திருவனந்தபுரம் ; குடியிருப்புப் பகுதியில் அருகில் உள்ள ஓடையில் பதுங்கியிருந்த 18 அடி நீளமுள்ள ராஜநாகத்தை
— Kᴀʙᴇᴇʀ - தக்கலை கபீர் (@Autokabeer) July 7, 2025
பருத்திப்பள்ளி ரேஞ்சின் வனப் பிரிவு பெண் அதிகாரி ரோஷ்னி அசால்டாக பிடித்த காட்சி. pic.twitter.com/wW0ey8dlmZ
Also Read: ప్రయాణికుల బస్సు బోల్తా.. 10 మంది స్పాట్ డెడ్ - మరో 24 మంది
దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పరుథిపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి ఘటనాస్థలానికి వచ్చారు. 18 అడుగుల పొడవున్న ఆ కింగ్ కోబ్రాను ఓ కర్ర సాయంతో పట్టుకొని సంచిలో బంధించారు. ఆమె ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా ఆ పామును పట్టుకున్నారు. పలువురు స్థానికులు ఆమె కోబ్రాను పట్టుకున్న దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమె ధైర్య సాహసాలపై నెటిజన్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కూడా రోషిణి దాదాపు 500లకు పైగా పాములు బంధించారు.
Also Read: ఛీ.. ఛీ.. ఇంటర్నెట్‌కు కూడా ఇబ్బందులు.. పాక్ నుంచి పారిపోతున్న కంపెనీలు!
Also Read : తెలంగాణ ICET ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండిలా?
king-cobra | kerala | rtv-news | telugu-news