/rtv/media/media_files/2025/07/04/vijay-mallya-and-lalit-modi-2025-07-04-13-20-56.jpg)
Vijay Mallya, Lalit Modi Sing At Lavish UK Party
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, కింగ్‌ఫిషర్ కంపెనీ ఓనర్ విజయ్ మాల్యా గురించి తెలియని వాళ్లుండరు. భారత్‌లో మనీలాండరింగ్‌తో పాటు ఇతర కేసుల్లో ఇరక్కుని వీళ్లిద్దరూ లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీళ్లకు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ గడిపిన ఓ వీడియో బయటపడింది. ఐ డిడ్ ఇట్ మై వే అంటూ అప్పటి అమెరికన్ సింగర్ ఫ్రాంక్ సినాత్రా పాడిన పాటను విజయ్ మాల్యా, లలిత్ మోదీ కలిపి పాడుతూ ఎంజాయ్ చేశారు.
Also Read: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుడుతున్న చిన్నారులు
గత ఆదివారం లలిత్ మోదీ తన నివాసంలో పార్టీ ఇచ్చారు. అక్కడికి విజయ్ మాల్యా కూడా వచ్చి ఆనందంగా గడిపారు. ఈ పార్టీలో వాళ్లిద్దరూ కలిసి పాడిన వీడియోను లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేకాదు ముందుగానే ఏం జరుగుతుందో అని ఊహిస్తూ '' కచ్చితంగా వివాదాస్పదం అవుతుంది. కానీ నాకు బాగా నచ్చేది అదే'' అంటూ సందేశం కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే లలిత్ మోదీ ఇచ్చిన ఈ పార్టీకి ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరైనట్లు ఆయన తెలిపారు. వీళ్లలో మాజీ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఉన్నారు.
ఇదిలాఉండగా లలిత్ మోదీపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడు 2010 దేశం విడిచి లండన్‌కు పారిపోయాడు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. ఇక విజయ్ మాల్యా బ్యాంకుల నుంచి రూ.9 వేలు కోట్ల రుణాలు ఎగవేత కేసులో ఇరుక్కుని లండన్‌కు పారిపోయారు. 2017లో లండన్‌లో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై అక్కడే ఉంటున్నారు. ఇద్దరూ చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.
Also Read: పాకిస్తాన్‌కు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్.. అన్ని ఆఫీసులు బంద్.. ఎందుకో తెలుసా?