ఏదో తప్పు జరిగింది.. మహారాష్ట్ర ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో వస్తున్న ఫలితాలను బట్టి ఏదో తప్పు జరిగినట్లు అనిపిస్తోందని అన్నారు. ఇది ప్రజల నిర్ణయం కాదని.. ఇక్కడ ఏం తప్పు జరిగిందో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు.