Ashwini Vaishnav: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు'

దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. మేకిన్ ఇండియా స్పూర్తితోనే ఈ హైస్పీడ్ రైళ్ల తయారీని చేపట్టినట్లు తెలిపారు.

New Update
HIGH Speed TRAIN

దూర ప్రయాణాలు చేసేవారికి గుడ్‌న్యూస్‌. దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నారు. బీఈఎంఎల్‌(BEML)తో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF) లో ఈ రైళ్ల డిజైన్, తయారీ కొనసాగుతోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో వందేభారత్ రైళ్లు సక్సెస్ అయిన నేపథ్యంలో మేకిన్ ఇండియా స్పూర్తితోనే ఈ హైస్పీడ్ రైళ్ల తయారీని చేపట్టినట్లు పేర్కొన్నారు.   

Also Read: కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలి: బీజేపీ నేత

ఖర్చు ఎక్కువే

ఈ రైళ్లను తయారుచేసేందుకు ఒక్కో బోగీకి ట్యాక్సులు మినహాయించి రూ.28 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇతర బోగీలతో పోల్చి చూస్తే ఈ ఖర్చు ఎక్కువవుతుందని తెలిపారు. అంతేకాదు ఈ హైస్పీడ్ రైళ్ల సెట్లను తయారు చేయడం సంక్లిష్టమైనదని.. ఇందులో సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు.  

Also Read: నాకు మోదీ, అమిత్‌ షా సపోర్ట్ ఉంది.. షిండే సంచలన ప్రకటన

అధునాతన ఫీచర్లు 

సాధారణ రైళ్లతో పోల్చి చూస్తే.. వీటి ఏరోడైనమిక్ భిన్నంగా ఉంటాయని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కనీసం గాలి కూడా చొచ్చుకపోవడానికి వీలు లేకుండా దీని బాడీ ఉంటుందని తెలిపారు. మొత్తం అన్నీ కూడా చైర్‌ కార్సే ఉంటాయన్నారు.ఇందులో అధునాతన ఫీచర్లు ఉంటాయని.. ఆటోమేటిక్ డోర్స్, బోగికి బోగీకి మధ్య లింక్, బయటి వాతావరణానికి అనుగుణంగా బోగి లోపల పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అలాగే సీసీటీవీలు, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉంటాయని చెప్పారు. దీని డిజైనింగ్ పూర్తయ్యాక ప్రాజెక్టు పూర్తి అయ్యే ఖర్చుపై ఓ అవగాహన వస్తుందని చెప్పారు. 

Also Read: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

Also Read: విజయ్‌ పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు