Eknath Shinde: సీఎం రేసు నుంచి తప్పుకున్న షిండే !.. సంచలన ట్వీట్ మహారాష్ట్ర సీఎం రేసు నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండే తప్పుకున్నట్లు తెలుస్తోంది. శివసేన కార్యకర్తలు వర్ష నివాస్ (సీఎం అధికారిక నివాసం) వద్ద గానీ, మరెక్కడా కూడా గుమికూడదని కోరుతున్నానని షిండే మంగళవారం ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. By B Aravind 26 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెర వీడలేదు. బీజేపీ నుంచే సీఎం అభ్యర్థిని తీసుకురావాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. మరోవైపు బిహార్ ఫార్ములా ప్రకారం.. ఏక్‌నాథ్ షిండేను సీఎంగా కొనసాగించాలని శివసేన కోరుతోంది. ఇలా ఎటూ తేలని పరిస్థితి నెలకొన్న నేపథ్యం సీఎం ఏక్‌నాథ్ షిండే తాజాగా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన సీఎం రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ? Maharashtra మంగళవారం తెల్లవారుజామున షిండే ఇలా పోస్ట్ చేశారు. '' ఎన్నికల్లో మహాయుతి గెలవడంతో మా ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోంది. మహాకూటమిగా మేము ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. ఇప్పటికీ కూడా కలిసే ఉన్నాం. నాపై ప్రేమతో కొన్ని సంఘాల వాళ్లు నన్ను కలిసేందుకు ముంబయికి వస్తామని అడుగుతున్నారు. వారు చూపిస్తున్న అభినానికి కృతజ్ఞతలు. అయితే నాకు మద్దతుగా అలా ఎవరూ రావొద్దని వేడుకుంటున్నాను. శివసేన కార్యకర్తలు వర్ష నివాస్ (సీఎం అధికారిక నివాసం) వద్ద గానీ, మరెక్కడా కూడా గుమికూడదని కోరుతున్నాను. బలమైన, సుసంపన్న మహారాష్ట్ర కోసం.. మహా కూటమి బలంగా ఉంది. అలాగే కొనసాగుతుందంటూ'' షిండే రాసుకొచ్చారు. Also Read : శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్..పదిరోజుల పాటు ఆ దర్శనాలు రద్దు! महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी… — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024 Also Read : జనావాసాలపై కుప్పకూలిన బోయింగ్ విమానం ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి రేసు నుంచి వైదొలుగుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదిలాఉండగా.. మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వాటిని అధికారులు ఖండించారు. షిండే కాకపోతే ఇక బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ షిండే అయ్యే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తాను రాజకీయాల కోసం రాలేదని వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చానని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. Also Read: ఆర్బీఐ గవర్నర్‌కు గుండెపోటు! #maharashtra #eknath-shinde #national-news #devendra-fadnavis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి