పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధానీ మోదీ విపక్షాలపై విమర్శలు చేశారు. అధికార దాహంగల పార్టీలను ప్రజలు తిరస్కరించారని.. ఇలాంటి పార్టీలు ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవన్నారు. కొందరు విపక్ష సభ్యులు బాధ్యతారహితంగా ఉంటారంటూ మండిపడ్డారు.

New Update
par modi

పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు ఇవి కొనసాగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు ముందు ప్రధానీ మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. '' అధికార దాహంగల పార్టీలను ప్రజలు తిరస్కరించారు. ఇలాంటి పార్టీలు ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవు. అందుకే పదేపదే ఇలాంటి పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. పిడికెడు మంది సభ్యులు సభను అడ్డుకుంటారు. కొందరు విపక్ష సభ్యులు బాధ్యతారహితంగా ఉంటారు. ప్రజల ఆకాంక్షలను సభ్యులు అర్థం చేసుకోవాలని'' ప్రధాని మోదీ అన్నారు.  

Also Read: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్‌, స్కూల్స్‌ బంద్‌

మరోవైపు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెప్పారు. రాజ్యాంగం వల్లే దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకురాగలిగామని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు సమున్నత స్థానం కల్పించినట్లు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలు సమాన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కారణం ఇదేనన్నారు. '' సమాజంలో పేద, అణగారిన వర్గాలు, వెనకబడిన తరగతులకు ఇంకా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ చెబుతుంటారు. 

రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. మన ఆలోచనలతో ఉన్నత ప్రమాణాలు ఉన్నప్పుడే ప్రభుత్వ సంస్థలను గౌరవించగలం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న పాత పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాజ్యాంగ పీఠికను చదువుతారని'' ఓం బిర్లా చెప్పారు. 

Also Read: మహారాష్ట్ర సీఎం ఎవరూ ? మరికొన్ని గంటల్లో స్పష్టత

ఇదిలాఉండగా ప్రస్తుతం అదానీ లంచం కేసు అంశం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్ష పార్టీ అదానీ అంశంపై చర్చించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్లమెంటులో చర్చించాలని తాము అఖిలపక్షంలో డిమాండ్ చేశామని కాంగ్రెస్ ఉపనేత గౌరవ్‌ గొగొయ్ తెలిపారు. ఈ స్కామ్ అమెరికాలో బయటపడినందున దానిపై ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. ఇక ఈ సమావేశాల్లో మొత్తం 17 బిల్లులు చర్చలకు రానున్నాయి.   

Also Read: ప్రారంభమైన శీతాకాలం సమావేశాలు..చర్చకు 17 బిల్లులు

Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు.. పంబ వరకూ క్యూలైన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు