త్వరలో మహా కుంభమేళా.. మొదటిసారిగా రోబోలతో

వచ్చే ఏడాది యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే రోబోటిక్ ఫైర్‌ టెండర్లను ఏర్పాటు చేసినట్లు అధికారురులు పేర్కొన్నారు. ఈరోబోలు మెట్లు ఎక్కుతాయని, మంటలను కూడా ఆర్పేస్తాయని చెప్పారు.

New Update
Kumbamela

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కుంభమేళాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోబోటిక్ ఫైర్‌ టెండర్లను ఏర్పాటు చేసినట్లు అధికారురులు పేర్కొన్నారు. దీంతోపాటు 200 మంది అగ్నిమాపక కమాండోలను కూడా సిద్ధంగా ఉంచనున్నట్లు చెప్పారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజా చౌహాన్ ఈ వివరాలు వెల్లడించారు. 

Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ?

'' అత్యవసర సమయాల్లో సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు రోబోటిక్ ఫైర్‌ టెండర్లు వినియోగిస్తాం. ఇది ఒక్కొక్కటి 20 నుంచి 25 కిలోల బరువు ఉంటుంది. ఈ రోబోలు మెట్లు ఎక్కుతాయి. అలాగే మంటలను కూడా అదుపు చేస్తాయి. దీంతోపాటు 35 మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసే ఆర్టిక్యూలేటింగ్‌ వాటర్‌ టవర్‌లు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ తరహాలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న ఎస్‌టీఆర్‌జీని ప్రారంభించాం. 

Also Read: ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు

ఈ యూనిట్‌లోSDRF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హైదరాబాద్‌లో ట్రైనింగ్ తీసుకున్న 200 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్లు జాతర జరిగే సమయంలో హైరిస్క్‌ జోన్‌లలో మోహరిస్తారని'' పద్మజా చౌహాన్ తెలిపారు. అయితే అగ్నిమాపక శకటాల కోసం గతంలో జరిగిన కుంభమేళాకు రూ.6 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం దాన్ని రూ.67 కోట్లకు పెంచినట్లు అధికారులు తెలిపారు. 

Also Read: వీడెవడండీ బాబు.. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలైపోవడం ఖాయం

Also Read: పాకిస్థాన్‌లో ఉద్రిక్తత.. కనిపిస్తే కాల్చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు