Maharashtra: సీఎంగా ఫడ్నవీస్‌.. షిండేకు కేంద్రమంత్రి పదవి !

మహారాష్ట్రలో సీఎం ఎవరూ అనే ఉత్కంఠకు ఇంకా తెర వీడలేదు. షిండే రాజీనామాతో దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం అవుతారని స్పష్టమైంది. అయితే షిండేకు డిప్యూటీ సీఎం లేదా కేంద్రమంత్రి పదవి ఇస్తారనే చర్చలు నడుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
Shinde and fadnavis

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా తెలలేదు. మంగళవారం రాజ్‌భవన్‌లో ఏక్‌నాథ్‌ షిండే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఒకవేళ షిండేనే సీఎం చేయాలని అనుకుంటే ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయొచ్చు. ఆయన రాజీనామా చేయడంతో.. షిండేకు ఇక ముఖ్యమంత్రి పదవి లేదనేది స్పష్టమవుతోంది. 

కేంద్ర కేబినెట్‌లోకి షిండే!

ఈ ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 132 సీట్లు వచ్చాయి. దీంతో సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కే హైకమాండ్‌ సీఎంగా బాధ్యతలు అప్పగించనుందని తెలుస్తోంది. అయిచే షిండే సీఎం పదవిని వదులుకున్న నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించాలని లేదా కేంద్ర కేబినెట్‌లోకి రావాలని బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అజిత్ పవార్ షిండేకు డిప్యూటీ సీఎం ఇవ్వకూడదని హైకమాండ్‌తో చెబుతున్నట్లు సమాచారం. మరి షిండే కేంద్ర మంత్రి పదవినీ తీసుకుంటారా లేదా రాష్ట్రంలోనే మంత్రిగా ఏవైనా కీలక శాఖలు ఇవ్వాలని పట్టుబడుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

మంగళవారం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, షిండే శిబిరం నేతల మధ్య సమావేశం జరిగింది. తనకు సీఎం పదవి లేకపోతే హోంశాఖ ఇవ్వాలని పట్టుబడినట్లు సంబంధింత వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు మహాయుతి కూటమిలో ఎలాంటి భేదాభ్రిప్రాయాలు రాకుండా ఉండేందుకు అధిష్ఠానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంకా మంతనాలు జరుగుతున్నాయని అంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ గడువు మంగళవారంతో ముగిసింది.  

ఇది కూడా చూడండి: రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దుపై పిటిషన్..ఆలోచిస్తున్నామన్న కేంద్రం

షిండే తన పదవికి రాజీనామా చేయడంతో గవర్నర్ దాన్ని ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు షిండేను తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరారు. మరోవైపు మహారాష్ట్రంలో బీహార్ ఫార్ములాను కూడా అమలు చేయాలని షిండే గ్రూప్ నేతలు కోరుతున్నారు. బీహార్‌ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్‌ కుమార్‌కు ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. షిండే నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు మహాయుతి కూటమి గెలుపునకు తోడయ్యాయని అందుకే మళ్లీ షిండేను సీఎంగా కొనసాగించాలని ఆయన వర్గం నేతలు కోరుతున్నారు.

ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

బీహర్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు  

అయితే బీహార్‌ ఫార్ములా మహారాష్ట్రలో పనిచేయదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే బలమైన నాయకత్వం ఉందని.. అందుకే అలాంటి అవకాశం లేదని అంటున్నారు. మరికొన్ని గంటల్లో సీఎం ఎవరూ అనేది ఎన్డీయే కూటమి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరి షిండే విషయంలో హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదిలాఉండా ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి 231 స్థానాల్లో గెలిచింది. ఇందులో బీజేపీ 132 సీట్లు సాధించగా.. శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్‌ పవార్) 41 సీట్లు సాధించాయి. ఇక మహా వికాస్ అఘాడి కేవలం 46 స్థానాలకే పరిమితమై ఓటమి పాలయ్యింది.   

ఇది కూడా చూడండి: పాపం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు వైద్యులు మృతి!

ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

#eknath-shinde #maharashtra #national-news #devendra fadnavis
Advertisment
Advertisment
తాజా కథనాలు