Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈరోజు (జనవరి 22) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయలతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి ట్రిప్పర్ని ఢీకొనడంతో పదిమంది మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.