Prashant Kishor : మొదటి లిస్టులో డాక్టర్లు, లాయర్లు.. ప్రశాంత్ కిషోర్ స్కెచ్ ఏంటి?

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జాన్ సురాజ్ పార్టీ  51 మందితో కూడిన అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. మొదటి జాబితాలో, 16 శాతం మంది, 17 శాతం మంది అత్యంత వెనుకబడిన వర్గాలకు టికెట్లు కేటాయించారు.

New Update
prashant

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections 2025) వేళ ప్రశాంత్ కిషోర్(prashant-kishor) నేతృత్వంలోని జాన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party)  51 మందితో కూడిన అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. మొదటి జాబితాలో, 16 శాతం మంది, 17 శాతం మంది అత్యంత వెనుకబడిన వర్గాలకు టికెట్లు కేటాయించారు. ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నాయకుడిగా మారిన కిషోర్ .. అవినీతి, నేర చరిత్ర మరక లేని క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించారు. ఎన్నికల్లో ఆయన అనేక మంది డాక్టర్లు, లాయర్లు,  మాజీ అధికారులు, పోలీసు అధికారులను రంగంలోకి దించారు.

Also Read :  వరకట్న వేధింపులు ?.. భార్యను చంపి మంచం కింద దాచిపెట్టిన భర్త

కె.సి. సిన్హా:ఈయన అనేక విశ్వవిద్యాలయాలకు వైస్-ఛాన్సలర్‌గా పనిచేసిన ప్రముఖ విద్యావేత్త. 30 ఏళ్లకు పైగా గణితంపై 70కి పైగా పాఠ్యపుస్తకాలు రాశారు. ఈయన పాట్నాలోని కుమ్రార్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
యదు వంశ గిరి: పాట్నా హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా, పలు కీలక న్యాయ పోరాటాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఈయన మాంఝి స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
డాక్టర్ బి.బి. ప్రసాద్ ఈయన మోతీహారిలో క్లినిక్ నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎ.కె. దాస్ ముజఫర్‌పూర్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు. వీరు డాకా, ముజఫర్‌పూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు.

Also Read :  మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రశాంత్ కిషోర్ పేరు లేకపోవడంతో

మొదటి జాబితాలో ప్రశాంత్ కిషోర్ పేరు లేకపోవడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్జేడీకి బలమైన స్థానం అయిన రాఘోపూర్ నుంచి, తేజస్వి యాదవ్ స్థానం నుంచి లేదా ఆయన సొంత నియోజకవర్గం కర్గహర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు