/rtv/media/media_files/2025/10/10/india-to-buy-uk-made-martlet-missiles-2025-10-10-16-15-24.jpg)
India to buy UK-made Martlet Missiles, Know Details
భారత్ అమ్ములపొదిలోకి మరో అడ్వాన్స్‌డ్ ఆయుధం రానుంది. భారత్-యూకే మధ్య రక్షణ రంగంలో పరస్పర సహకారంలో భాగంగా కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. యూకే తేలికపాటి, బహుళ ప్రయోజనకర మిసైల్ సిస్టమ్ అయిన 'మార్ట్‌లెట్'(Martlet Missiles) లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకరించింది. దీనివల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
మార్ట్‌లెట్ క్షిపణుల ప్రత్యేకత
ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్క్‌కు చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్(defense-system) అనే రక్షణరంగ కంపెనీ.. ఈ మార్ట్‌లెట్ మిసైల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇతిహాసాలు, పురాణాల్లో ఉండే మార్ట్‌లెట్ అనే పక్షి ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకోకుండా, అలుపెరగకుండా ఉండే పక్షి. అందుకే ఆ క్షిపణులకు ఆ పక్షి పేరు పెట్టారు. ఈ క్షిపణులు అనేవి తేలికపాటి, బహుళ ప్రయోజనకర ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్
టు సర్ఫెస్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్ వ్యవస్థలుగా పనిచేస్తాయి.
Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్‌షాక్ ... ఈ సారి నోబెల్ ప్రైజ్ ఎవరికంటే?
మార్ట్‌లెట్ క్షిపణులను డ్రోన్లు, సాయుధ వాహనాలను కూడా ఛేధించేలా తయారుచేశారు. దీన్ని లేజర్ బీమ్ గైడెన్స్ ఆధారంగా రూపొందించారు. ఈ మిసైల్‌ను సైనికులు తమ భుజంపై ఉంచి ప్రయోగించే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు వీటిని సాయుధ వాహనాలకు లింక్ చేయోచ్చు. హెలికాప్టర్లు, నౌకల నుంచి ప్రయోగించవచ్చు. 6 కిలోమీటర్ల పరిధిలో శత్రువుల నుంచి వచ్చే భూ, గగనతల ముప్పును ఈ మిసైల్స్ ఛేదించగలవు. ఈ క్షిపణి 13 కిలోల బరువు ఉంటుంది. ధ్వని వేగం కన్నా ఒకటిన్నర రేట్లు స్పీడ్‌గా దూసుకెళ్లగలదు. 2019 నుంచి దీన్ని బ్రిటన్ మిలటరీలో వినియోగిస్తున్నారు. ఈ మిసైల్స్‌ను ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యాపై వాడుతోంది.
Also Read: ఈ రంగాల వారికి బిగ్ షాక్.. హెచ్-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు.. ఇక వెళ్లడం కష్టమే!
ఇదిలాఉండగా బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భారత నౌకదళంతో కలిసి పనిచేయడం కోసం ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నౌకాదళం అభివృద్ధి చేస్తున్న దేశీయ మొదటి ఎలక్ట్రిక్ యుద్ధ నౌక డిజైనింగ్‌తో పనిచేసేందుకు రోల్స్ రాయిస్ భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలో హైబ్రీడ్ ఎలక్ట్రిక్‌తో పాటు పూర్తిస్థాయి ఎలక్ర్టిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌లను అందించనున్నట్లు తెలుస్తోంది.
India has signed a $468 million deal with #Thales for the supply of #Martlet Lightweight Multirole Missiles (LMM) to the #IndianArmy. pic.twitter.com/5f4vR6zqP6
— News IADN (@NewsIADN) October 9, 2025