Karnataka : కర్ణాటకలో సీఎం మార్పు.. ముహుర్తం ఫిక్స్!

సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. 2.5 సంవత్సరాల పదవీకాలం ఒప్పందం ముగియనున్నందున, ఆయన ప్రస్తుత మంత్రుల్లో 50 శాతం మందిని తొలగించి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం

New Update
karnataka

కర్ణాటక రాజకీయాల్లో(karnataka politics) కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. 2.5 సంవత్సరాల పదవీకాలం ఒప్పందం ముగియనున్నందున, ఆయన ప్రస్తుత మంత్రుల్లో 50 శాతం మందిని తొలగించి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న సగం మందిని తొలగించి, వారి స్థానంలో కొత్తవారికి ముఖ్యంగా సీనియర్ నాయకులకు మంత్రి పదవులు అప్పగించాలని సిద్ధరామయ్య యోచిస్తున్నారు. ఈ మార్పులు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరగనున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. సీఎం  సిద్ధరామయ్య అక్టోబర్ 13న అన్ని కేబినెట్ మంత్రులకు విందు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read :  మొదటి లిస్టులో డాక్టర్లు, లాయర్లు.. ప్రశాంత్ కిషోర్ స్కెచ్ ఏంటి?

బీహార్ ఎన్నికల తర్వాత

బీహార్ ఎన్నికల(Bihar Elections 2025) తర్వాత వ్యూహాత్మకంగా మంత్రుల మార్పు ఉంటుందని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి డిప్యూటీ సీఎం డికె శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని, ఇది ముఖ్యమంత్రికి, పార్టీకి  సంబంధించినది అని అన్నారు. తాను పార్టీ కోసం పనిచేస్తానని, తాను దేనిలోనూ జోక్యం చేసుకోనని అన్నారు.  కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటినుంచో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్,  అనేక మంది ఇతర నాయకులు 2.5 సంవత్సరాల తర్వాత నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే అలాంటిది ఏమీ లేదని తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య  తెలిపారు.  

Also Read :  అమ్మతోడు.. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.. తేజస్వి యాదవ్ సంచలన హామీ

మహిళా ఉద్యోగులందరికీ తప్పనిసరి

మరోవైపు కర్ణాటక మంత్రివర్గం ఉద్యోగం చేస్తున్న మహిళలకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన రుతుస్రావ సెలవు (నెలసరి సెలవు) ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఈ విధానం రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, బహుళజాతి సంస్థలు (MNCs), ఐటీ కంపెనీలు, గార్మెంట్ పరిశ్రమలు మరియు ఇతర అన్ని ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే మహిళా ఉద్యోగులందరికీ తప్పనిసరిగా వర్తిస్తుంది. ఈ నిర్ణయం ప్రకారం, మహిళా ఉద్యోగులు సంవత్సరంలో మొత్తం 12 రోజుల సెలవును తీసుకోవచ్చు.  పనిచేసే మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, వారికి శారీరక, మానసిక సౌకర్యాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విధానాన్ని అన్ని రంగాలలో అమలు చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇప్పటికే కేరళ, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పాక్షికంగా లేదా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సెలవులు అమలులో ఉన్నాయి.  

Advertisment
తాజా కథనాలు