Amir Khan Muttaqi : భారత్ గడ్డపై నుంచి పాకిస్తాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తన తొలి భారత పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమ దేశంలోకి పాక్ అక్రమ చొరబాట్లను ఖండిస్తున్నామని అన్నారు.

New Update
afgan

ఆఫ్ఘనిస్తాన్(afganisthan) తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తన తొలి భారత పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమ దేశంలోకి పాక్ అక్రమ చొరబాట్లను ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి విధానాలతో ఇరుదేశాల మధ్య సమస్యలు పరిష్కారం కావు. ఆఫ్ఘన్ల ధైర్యాన్ని,సహనాన్ని  పరీక్షించకూడదు అని హెచ్చరించారు. ఎవరికైనా తెలియకపోతే వారు బ్రిటీష్, సోవియట్, అమెరికన్లను అడగాలి అని అన్నారు.

Also Read :  ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం

40 ఏళ్ల తర్వాత దేశంలో శాంతి

ఇక తమ నేల నుంచి ఇరు దేశాలపై దాడి చేసేందుకు ఎవరికి అనుమతి ఇవ్వబోమని ముత్తాఖీ స్పష్టం చేశారు. సమస్యలను బలం ద్వారా పరిష్కరించుకోకూడదని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ఒక స్వతంత్ర దేశమని, 40 ఏళ్ల తర్వాత దేశంలో శాంతి, అభివృద్ధిని చూస్తున్నామని, దీని వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదని ముత్తాఖీ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించిన నేపథ్యంలో, ముత్తాఖీ ఈ గట్టి హెచ్చరిక చేశారు.

ఈ హెచ్చరికను ముత్తాఖీ భారత్ లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇతర ఉన్నతాధికారులను కలిసిన తర్వాత విలేకరుల సమావేశంలో చేశారు.  భారత్ కు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగించడానికి, విస్తరించడానికి అమీర్ ఖాన్ ముత్తాఖీ స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ఒక జాయింట్ ట్రేడ్ కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు.  కాగా 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ , తాలిబాన్ మధ్య జరిగిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశం ఇది. 

Also Read : White House : నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై వైట్‌హౌస్ సంచలన రియాక్షన్

Advertisment
తాజా కథనాలు