HCA: HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ యాపిల్ టెక్ కంపెనీ తమ నాయకత్వ బాధ్యతల్లో మార్పునకు శ్రీకారం చుట్టింది. భారతీయ మూలాలున్న సబిహ్ ఖాన్ ఈ నెల చివర్లో.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) బాధ్యతలు స్వీకరించనున్నారు. యాపిల్ సంస్థలో ఈయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది.
ఐఎస్ఎస్లోకి వెళ్లిన తొలి భారతీయ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో ఇస్రో ఛైర్మన్ డా. వి.నారాయణతో ఫోన్లో సంభాషించారు. ఈ మిషన్‌కు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలు, శుభాంశు శుక్లా ఆరోగ్యం, ఇతర అంశాల గురించి వీళ్లు చర్చించారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మిగిలింది. మాండ్య జిల్లాలోని కావేరి నదిలో ఆదివారం సాయంత్రం ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ 36 ఏళ్ల ఓ వ్యక్తి అందులో పడి కొట్టుకుపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లో రైతులు మామిడిపండ్లకు కొత్త కొత్త పేర్లు పెడుతూ జనాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా మోదీ, యోగీ, అమిత్ షా, రాజ్‌నాథ్, ములాయం, అఖిలేశ్ లాంటి ప్రముఖ రాజకీయ నేతల పేర్లు పెట్టి మార్కెట్లోకి తీసుకొచ్చారు.
బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా AI2414 విమానం మరో 5 నిమిషాల్లో టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసే సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.
బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణం జరిగింది. పెళ్లైన 45 రోజులకే గుంజాదేవి అనే యువతి తన మామతో కలిసి భర్తను లేపేసింది. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. మామ, కోడలి మధ్య అక్రమ సంబంధమే దీనికి కారణమని పోలీసులు తెలిపారు.
గోవా నుంచి పుణె వెళ్తున్న స్పేస్‌జెట్ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ముంబైలో పెద్ద అపార్ట్మెంట్లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. 22వ అంతస్తుకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లగా.. ఒక్కసారిగా అదుపుతప్పి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. రక్షించేవారు లేకపోవడంతో ప్రాణాలు విడిచాడు.