Donald Trump : రష్యా చమురు తగ్గించండి లేదంటే..భారత్ కు ట్రంప్ హెచ్చరిక

భారత్ పై మరోసారి రెచ్చిపోయారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని, లేని పక్షంలో భారీ దిగుమతి సుంకులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

New Update
modi and trump

భారత్ పై మరోసారి రెచ్చిపోయారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump). రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని, లేని పక్షంలో భారీ దిగుమతి సుంకులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే 25 శాతం సుంకం విధించామని,  దీన్ని 50 శాతం వరకు పెంచే అవకాశం ఉందని ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు." నేను భారత ప్రధానమంత్రి మోడీ(narendra-modi)తో మాట్లాడాను, రష్యా చమురు కొనుగోళ్లను చేయబోనని చెప్పాడు" అని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియాతో అన్నారు. 

Also Read :  ఢిల్లీలో రెడ్ జోన్.. పండగపూట గాల్లో ప్రమాద హెచ్చరికలు

ఖండించిన భారత్

అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఇంధన భద్రత, స్థిరమైన సరఫరాలు, ధరల కోసమే తాము మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చమురు కొనుగోలు చేస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చమురు కొనుగోలు నిర్ణయాలపై ఏ దేశం కూడా ఒత్తిడి చేయకూడదని భారత్ బదులిచ్చింది.ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, రాయితీ ధరలకు లభిస్తున్న రష్యా చమురును భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. 

అయితే, దీనిపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, భారత్‌పై ఇప్పటికే అదనపు సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

Also Read :  ఢిల్లీ పేరు మార్చాలని డిమాండ్.. కొత్త పేరేంటో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు