/rtv/media/media_files/2025/10/20/odishas-crime-2025-10-20-13-02-27.jpg)
Odishas crime
ఒడిశా(odisha crime)లో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. కూతురిని లైగికంగా వేధించాడనే(sexual-assault) అమ్మాయి తండ్రి యువకుడిని హత్య చేసి శవాన్ని కాలువలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. ఇది కేవలం కోపంతో చేసిన పనా. లేదా పాత పగలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Also Read : దీపావళి వేళ నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?
శవాన్ని కాలువలో పడేసి
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని ధెంకనాల్ జిల్లాలో కరుణాకర్ బెహెరా అనే యువకుడు జేసీబీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే శనివారం రాత్రి యువతి తండ్రి రూప పింగువా.. కరుణాకర్ బెహెరా తన కూతురిని లైంగికంగా వేధించడం చూశాడు. దీంతో తట్టుకోలేకపోయిన పింగువా పదునైన ఆయుధంతో యువకుడిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో యువకుడు కరుణాకర్ బెహెరా అక్కడిక్కడే మరణించాడు. హత్య చేసిన తర్వాత పింగువా యువకుడి మృతదేహాన్ని తీసుకెళ్లి కాలువలో పడేశాడు. అనంతరం తానే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు.
విషయం తెలియగానే యువకుడి తండ్రి కాశీనాథ్ బెహరా, ఇతర కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. పింగువా తమ కొడుకును అత్యంత దారుణంగా కొట్టి చంపాడని ఆరోపించారు. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హత్య వెనుక మరో కథనం కూడా వినిపిస్తోంది. పింగువా కూతురు, చనిపోయిన యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, పింగువా వారిద్దరినీ చూడకూడని స్థితిలో చూశాడని, దీంతో కోపం పట్టలేక యువకుడిని హత్య చేశాడని చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి తండ్రి పింగవాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ అమ్మాయి, యువకుడికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటీ? హత్య చేయడానికి గల కారణం ఏంటీ ? అనే విషయాలను ఆరా తీస్తున్నారు.
Also Read: CINEMA: ఆ కోరిక ఆపుకోలేకపోయా.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
Follow Us