Diwali Holidays : ఇదిరా కంపెనీ అంటే.. ఉద్యోగులకు 9 రోజులు దీపావళి సెలవులు

పండుగల సీజన్‌లో కార్పొరేట్ కంపెనీలు బోనస్‌లు, స్వీట్లు ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు ఊహించని సప్ రైజ్ ఇచ్చింది. దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఏకంగా తొమ్మిది రోజుల సెలవు ప్రకటించింది.

New Update
holidays

పండుగల సీజన్‌లో కార్పొరేట్ కంపెనీలు బోనస్‌లు, స్వీట్లు ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు ఊహించని సప్ రైజ్ ఇచ్చింది(Diwali Break Every Employees Dream 2025). దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఏకంగా తొమ్మిది రోజుల సెలవు(diwali holidays) ప్రకటించింది. ఢిల్లీకి చెందిన ఒక పీఆర్ సంస్థ ఉద్యోగులకు ఆ మేరకు మెయిల్ పంపించింది. ఎలైట్ మార్క్ వ్యవస్థాపకుడు, CEO అయిన రజత్ గ్రోవర్ ఇటీవలే మొత్తం కంపెనీకి దీపావళికి తొమ్మిది రోజుల సుదీర్ఘ సెలవులను ప్రకటిస్తూ ఇమెయిల్ పంపారు, ఈ సెలవులు అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 26, వరకు కొనసాగుతాయి.

Also Read :  విద్యార్థికి ఘోర అవమానం.. ఫీజు చెల్లించలేదని నేలపై కూర్చోబెట్టి పరీక్షలు

కొత్త శక్తితో తిరిగి పనిలోకి

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ..  మా ఉద్యోగుల కష్టానికి, అంకితభావానికి విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. దీపావళి(Diwali 2025) అనేది కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ. పని నుంచి పూర్తి విరామం లభిస్తేనే వారు మరింత ఉల్లాసంగా, కొత్త శక్తితో తిరిగి పనిలోకి రాగలుగుతారు. అందుకే 'నో ఈమెయిల్ పాలసీ'ని అమలు చేస్తున్నాం అని తెలిపారు.సాధారణంగా సెలవుల్లో కూడా ఈమెయిల్స్, ఆఫీసు సందేశాల కారణంగా ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులు, ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధానం ఇతర కార్పొరేట్ సంస్థలకు కూడా ఒక ఆదర్శంగా నిలవనుంది. పని-జీవిత సమతుల్యత (Work-Life Balance) విషయంలో ఈ సంస్థ తీసుకున్న చొరవ అభినందనీయం. ఎలైట్ మార్క్‌లోని ఒక HR ప్రొఫెషనల్ లింక్డ్‌ఇన్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read :  ప్రధాని మోడీని కలిసిన రామ్ చరణ్‌ దంపతులు.. ఎందుకంటే?

Advertisment
తాజా కథనాలు