PM Modi : ప్రధాని మోదీ దీపావళి విషెస్!

దీపాల పండుగ దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మన చుట్టూ సానుకూలత స్ఫూర్తి ప్రబలాలి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

New Update
diwali

దీపాల పండుగ దీపావళి(Diwali 2025) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. "దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ వెలుగుల పండుగ మన జీవితాలను సామరస్యం, సంతోషం, శ్రేయస్సుతో ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాను. మన చుట్టూ సానుకూలత స్ఫూర్తి ప్రబలాలి." అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Also Read :  వయస్సు పెరిగే కొద్దీ స్త్రీల కంటే పురుషుల్లోనే అది ఎక్కువ.. సర్వేలో షాకింగ్ విషయాలు

ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ప్రధాని మోదీ ఈ సంవత్సరం కూడా దేశ సరిహద్దుల్లోని సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.దేశ రక్షణ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సైనికులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఆయన ప్రతి ఏటా ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. 

Also Read :  దీపావళి శుభ్రతలో.. ఎలుకలు మళ్లీ రాకుండా నిపుణుల సూచనలు

దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు

అంతకుముందు రోజు దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలను కోరారు. "మన ప్రజల శ్రమ, మన యువత నైపుణ్యం, చెమటతో తయారైన ఉత్పత్తులనే మనం కొనాలి. ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలి," అని ఆయన అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్థానిక వ్యాపారాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలస్తంభాలని ప్రధాని నొక్కి చెప్పారు. పండుగ సీజన్లలో మరియు సాధారణ రోజుల్లో కూడా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఈ వ్యాపారాలకు అండగా నిలవాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు