/rtv/media/media_files/2025/10/20/delhi-name-2025-10-20-07-15-10.jpg)
దేశ రాజధాని ఢిల్లీ పేరును వెంటనే ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad) డిమాండ్ చేసింది. ఢిల్లీకి దాని పురాతన చరిత్ర, సంస్కృతితో తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పేరు మార్పు జరగాలని వీహెచ్‌పీ కోరింది. ఈ మేరకు వీహెచ్‌పీ ఢిల్లీ శాఖ కార్యదర్శి సురేంద్ర కుమార్ గుప్తా ఢిల్లీ సాంస్కృతిక మంత్రికి లేఖ రాశారు. కేవలం ఢిల్లీ పేరునే కాకుండా, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును 'ఇంద్రప్రస్థ(Indraprastha) అంతర్జాతీయ విమానాశ్రయం'గా, ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను 'ఇంద్రప్రస్థ రైల్వే స్టేషన్'గా, అలాగే షాజహానాబాద్ డెవలప్‌మెంట్ బోర్డును 'ఇంద్రప్రస్థ డెవలప్‌మెంట్ బోర్డు'గా మార్చాలని వీహెచ్‌పీ ఆ లేఖలో పేర్కొంది.
Also Read : ఢిల్లీలో రెడ్ జోన్.. పండగపూట గాల్లో ప్రమాద హెచ్చరికలు
Delhi Name Change As Indraprastha
పేర్లు కేవలం మార్పులు మాత్రమే కాదు. అవి ఒక దేశ చైతన్యానికి అద్దం పడతాయని సురేంద్ర కుమార్ గుప్తా లేఖలో తెలిపారు. "మనం 'ఢిల్లీ' అని చెప్పినప్పుడు, కేవలం 2,000 సంవత్సరాల చరిత్ర మాత్రమే కనిపిస్తుంది. కానీ 'ఇంద్రప్రస్థ' అని చెప్పినప్పుడు, మనం 5,000 సంవత్సరాల గొప్ప చరిత్రతో అనుసంధానం అవుతాము" అని ఆయన వివరించారు.
చరిత్రకారులు, పండితులు, ప్రజల ప్రతినిధులు ఇటీవల నిర్వహించిన 'ఇంద్రప్రస్థ పునరుజ్జీవన సంకల్ప సభ'లో చేసిన సూచనల ఆధారంగా ఈ డిమాండ్లను చేసినట్లు గుప్తా తెలిపారు. ముస్లిం ఆక్రమణదారుల స్మారక చిహ్నాలు ఉన్న చోట, హిందూ వీరులు, ఋషులు, పాండవుల కాలం నాటి స్థలాలను పరిచయం చేయాలని, వాటి వద్ద స్మారక చిహ్నాలను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఢిల్లీలోని విద్యా పాఠ్యాంశాలలో హేమచంద్ర విక్రమాదిత్య రాజు మరియు పాండవుల కాలం నాటి ఇంద్రప్రస్థ చరిత్రను చేర్చాలని కూడా వీహెచ్‌పీ కోరింద
Also Read : ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం