/rtv/media/media_files/2025/10/20/modi-with-navy-2025-10-20-12-10-40.jpg)
సైనికులతో కలిసి దీపావళి పండుగ సంబరాలు(Diwali Celebrations 2025) చేసుకునే ఆనవాయితీని ప్రధాని మోదీ కొనసాగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోవా సముద్ర తీరంలోని INS విక్రాంత్‌లో నేవీ(Indian Navy) సిబ్బందితో మోదీ( PM modi with navy) దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటు కూడా మొదలైందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సైనికులకు స్వీట్లు తినిపించి, వారితో ముచ్చటించిన మోదీ వారిలో స్ఫూర్తిని నింపారు. దేశ భద్రతలో నావికాదళం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు.
Also Read : భారత్‌తో పాటు దీపావళి జరుపుకునే 9 దేశాలు ఇవే!
PM Modi Celebrates Diwali
Celebrating Diwali with our brave Navy personnel on board the INS Vikrant. https://t.co/5J9XNHwznH
— Narendra Modi (@narendramodi) October 20, 2025
ప్రధాని మోదీ(PM Modi) గోవాలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది. సైనికులే భారత్ బలం. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఉంది. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు, దీపావళికి వెలిగించే దీపాల లాంటివి. ఐఎన్‌ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది. పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయి.
Also Read : ఇదిరా కంపెనీ అంటే.. ఉద్యోగులకు 9 రోజులు దీపావళి సెలవులు
🇮🇳"I am fortunate that this time I am celebrating this holy festival of Diwali among all you brave soldiers of the Navy", says PM Narendra Modi as he celebrates Diwali🪔at INS Vikrant off the coast of Goa and Karwar
— Rakesh Kishore 🇮🇳 (@RakeshKishore_l) October 20, 2025
Powerful message from India to the world👍 pic.twitter.com/QWLgAAYxNQ
ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత తొలి దీపావళిలో మోదీ పాల్గొన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ.. సియాచిన్, కార్గిల్ వంటి సరిహద్దు ప్రాంతాలతో సహా వివిధ ఫార్వర్డ్ పోస్టులలో సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది, గోవా-కార్వార్ తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళిని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.