Municipal Corporation : ఉత్కంఠ రేపిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక..చివరికి
రెండు రోజులుగా ఉత్కంఠ రేపిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని ఎట్టకేలకు టీడీపీ దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ గా ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. కాగా తిరుపతిలో కార్పొరేటర్లను తమవైపునకు తిప్పుకోవడంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.