/rtv/media/media_files/2026/01/24/kavitha-2026-01-24-11-20-57.jpg)
Telangana Jagruthi: త్వరలో జరగబోయే పురపాలక సంఘ ఎన్నిక(Local Body Elections 2026) ల్లో పోటీ చేయాలని కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi Kavitha) నేతృత్వలోని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. రానున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ జాగృతి పోటీకి సిద్ధమవుతోంది. మరోవైపు ఆ పార్టీ ముఖ్య నేతలు రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌లో వేగం పెంచారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో.. ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఉమ్మడి గుర్తు కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫారంతో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : మున్సి'పోల్స్' బరిలో కవిత తెలంగాణ జాగృతి... ఆ గుర్తుపై పోటీ?
Telangana Jagruthi Contests In Local Elections
కాగా గతంలో ఇదే విషయమై ఆర్టీవీ(rtv) ప్రత్యేక కథనం కూడా రాసింది. అయితే అపుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అయితే తాజాగా కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జాగృతి కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడితో ప్రతి మున్సిపాలిటీలో సుమారు 20 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను దింపేందుకు కవిత వ్యూహరచన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఆశావహులతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తన మద్దతుదారులను బరిలో నిలపడం ద్వారా జనం నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ పలువురు కవిత మద్దతుదారులు విజయం సాధించారని తెలుస్తోంది. ఇప్పుడు మున్సి పాల్ బరిలోనూ జాగృతిని నిలపడం ద్వారా భవిష్యత్తులో పార్టీ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకోవాలని చూస్తోంది. - local body elections in telangana
Also Read : మేడారం జాతరకు కేంద్రం గుడ్ న్యూస్ .. మరో రూ.3.70 కోట్ల నిధులు విడుదల
Follow Us