Municipal Elections : ఇబ్రహీంపట్నంలో ఇద్దరు అభ్యర్థులు మిస్సింగ్..ఎన్నికల వేళ హైటెన్షన్‌

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎపిసోడ్  రసవత్తరంగా సాగుతోంది. చైర్ పర్సన్, మేయర్ ఎన్నికల వేళ రాష్ట్రమంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రమాణస్వీకరానికి అంతా మున్సిపాలిటీ కార్యాలయాలకు చేరుకున్నారు. అయితే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు అభ్యర్థులు అదృశ్యమవ్వడం కలకలం రేపింది. .

New Update
FotoJet (4)

ibrahimpatnam muncipality

Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎపిసోడ్  రసవత్తరంగా సాగుతోంది. మున్సిపల్ చైర్ పర్సన్, మేయర్ ఎన్నికల వేళ రాష్ట్రమంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయా పార్టీల అభ్యర్థులతో అన్ని రాజకీయ పార్టీలు మున్సిపాలిటీ కార్యాలయాలకు చేరుకున్నారు. అయితే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు అభ్యర్థులు అదృశ్యమవ్వడం కలకలం రేపింది. .ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదని..అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు పోలీసులకుఫిర్యాదు చేశారు. అదే సమయంలో19వ వార్డు లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి కూడా కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడం స్థానికంగా హైటెన్షన్ కు దారి తీసింది.

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్-13, కాంగ్రెస్-8, బీజేపీ-2, ఇండిపెండెంట్-1 గెలుపొందారు.. దీంతో బీఆర్ఎస్ సభ్యులు క్యాంపుకు వెళ్లారు. వారిలో బీఆర్ఎస్-13, బీజేపీ-1, ఇండిపెండెంట్-1 మొత్తం-15 మంది ఉండగా..కాంగ్రెస్ క్యాంపులో కాంగ్రెస్-8, ఎక్స్ అఫిషియో-1 మొత్తం 9 మంది ఉన్నారు. ఈ క్రమంలో మునిసిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న క్రమంలో ఇద్దరు అభ్యర్థులు మిస్‌ కావడం సంచలనంగా మారింది.

బీఆర్ఎస్ క్యాంపులో ముసలం అంటూ ప్రచారం జరిగింది. దీంతో బీఆర్‌ఎస్‌ లో అసంతృప్తిగా ఉన్న కొంతమంది  కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని  తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకొంటామన్న ధీమాతో ఉంది.  ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదంటూ ఆయన  తల్లి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 13 వార్డు స్థానాలను గెలవగా ఇండిపెండెంట్-1, బీజేపీ-1 సభ్యుడితో కలిసి  చైర్మన్ పీఠానికి స్పష్టమైన మెజారిటీ ఉందని ధీమా వ్యక్తం చేస్తున్న క్రమంలో మిస్సింగ్‌ వార్తా బీఆర్‌ఎస్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది.

Advertisment
తాజా కథనాలు