Telangana Municipal Elections : తెలంగాణ మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు ?

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో  వార్డులు, చైర్పర్సన్‌, మేయర్‌ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది.

New Update
FotoJet - 2026-01-15T074800.063

Reservations for Telangana municipalities

Telangana Municipal Elections :  తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో  వార్డులు, చైర్పర్సన్‌, మేయర్‌ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది.మొత్తం రిజర్వేషన్లు 50%  మించకూడదనే రాజ్యాంగ మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించినట్లు స్పష్టం చేసింది.

జనాభా ప్రాతిపదికన ఏ ఏ కేటగిరీలకు ఎన్ని స్థానాలు కేటాయించాలనే అంశంపై స్పష్టతనిస్తూ ప్రాథమిక జాబితాను సిద్ధం చేశారు.  మునిసిపాలిటీ చైర్మన్ల సంఖ్య విభాగాల వారీగా.. జనరల్‌ 30, జనరల్‌ మహిళలు 31 స్థానాలు, ఎస్టీ జనరల్‌ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్‌ 9, ఎస్సీ మహిళ 8, బీసీ జనరల్‌ 19, బీసీ మహిళ 19 స్థానాలను కేటాయించాలని పురపాలకశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.  

ముఖ్య మార్గదర్శకాలు

కాగా, ప్రభుత్వం రిజర్వేషన్లలో పలు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంది. వాటిలో జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు. మహిళలకు మొత్తం సీట్లలో 50% రిజర్వేషన్లు.. మహిళా రిజర్వేషన్ లాటరీ విధానంలో ఖరారు. బీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు అమలు. తాజా జనగణన డేటా ఆధారంగా సీట్ల ఖరారు.SEEEPC సర్వే–2024 డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు.గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులు ఈసారి మినహాయింపు.మున్సిపాలిటీల్లో వార్డులకు 2011 జనగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు,బీసీలకు ప్రత్యేక కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్,, మహిళలకు (జనరల్) 2019 టీఎం చట్టం ప్రకారం సీట్లు,ప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య ఖరారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, అన్‌రిజర్వ్డ్ సీట్ల స్పష్టమైన విభజన. గ్రేటర్ కాకుండా అన్ని మున్సిపాలిటీలకు వర్తింపు. జిల్లా వారీగా రిజర్వేషన్ పట్టికలు విడుదల తదితర మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంది.

రిజర్వేషన్ల వివరాలు

మొత్తం 121 మున్సిపాలిటీల్లో స్థానాల కేటాయింపు. జనరల్: 61 స్థానాలు (వీటిలో జనరల్ 30, జనరల్ మహిళ 31), బీసీ (వెనుకబడిన తరగతులు): 38 స్థానాలు (బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19),ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు): 17 స్థానాలు (ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8), ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు): 5 స్థానాలు (ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2), మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ దాదాపు 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించడం గమనార్హం.

తుది ప్రకటన ఈ నెల 17న

కాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 17 లోపు నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం.మునిసిపాలిటీ చైర్మన్ల రిజర్వేషన్ల స్థానాల సంఖ్యను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఏయే మున్సిపాలిటీ ఏ వర్గానికి కేటాయించాలనే (లక్కీ డిప్ లేదా రోస్టర్ విధానం) తుది రిజర్వేషన్లను ఈ నెల 17న అధికారికంగా ప్రకటించనుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. అభ్యర్థులు తమ తమ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
 

Advertisment
తాజా కథనాలు