Rohit Sharma : వేటు వేశారా.. లక్నోతో మ్యాచ్‌లో రోహిత్ ఎందుకు ఆడలేదు?
ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. నెట్స్‌లో సాధన చేస్తుండగా మోకాలికి బంతి తగలడంతో అతను అందుబాటులో లేకుండా పోయాడని జట్టు వర్గాలు తెలిపాయి. కానీ నిజంగా అదే కారణమా, లేక రోహిత్‌పై వేటు వేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.